హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రాయలసీమలో మళ్లీ రోడ్డెక్కిన లాయర్లు.. వారి డిమాండ్ ఇదే..!

రాయలసీమలో మళ్లీ రోడ్డెక్కిన లాయర్లు.. వారి డిమాండ్ ఇదే..!

రాయలసీమలో హైకోర్టు కోసం లాయర్ల నిరసనలు

రాయలసీమలో హైకోర్టు కోసం లాయర్ల నిరసనలు

రాయలసీమ (Rayalaseema) లో హైకోర్టు (High Court) ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అనంతపురం (Anantapuram) యువ న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్న న్యాయ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

రాయలసీమ (Rayalaseema) లో హైకోర్టు (High Court) ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అనంతపురం(Anantapuram) యువ న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు న్యాయ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. సీఎం జగన్ (AP CM YS Jayan) అసెంబ్లీ సాక్షిగా న్యాయ రాజధానిగా రాయలసీమలోని కర్నూలు (Kurnool) లో ఏర్పాటు చేస్తామని, నేటికి కూడా ఎటువంటి కార్యక్రమాలు రాయలసీమలో ప్రారంభించకపోవడం చూస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ ప్రాంత వాసులు నిజమైనటువంటి ప్రేమ ,విశ్వాసం ,లేదని నిరూపితం అవుతున్నదన్నారు. అంతే కాకుండా జ్యుడీషియల్ అకాడమీను రాజధాని ప్రాంతం నందు ప్రారంభించడం చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు, ఆచరణలో ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉందన్నారు.

అంతేకాకుండా శ్రీ భాగ్ ఒప్పందంలో అంశాలను ఆంధ్రప్రదేశ్ కు నేటి ముఖ్యమంత్రి వరకు పరిపాలించిన కూడా, రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు అని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్ సమావేశాలను బిల్లును ప్రవేశపెట్టి న్యాయ రాజధానిగా రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇది చదవండి: ఇస్కాన్ ఆలయాల్లో ఇదే అందమైనది.. ఇక్కడ హైలెట్ అదే..!

ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నందు, వచ్చినటువంటి ఫలితాలను చూస్తూ ఉంటే, రాయలసీమ ప్రాంత వ్యాప్తంగా ఉన్న గ్రాడ్యుయేట్లుఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్న అంశం పైన పునర ఆలోచించాలని, 2024వ సంవత్సరం కల్లా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతామనిరాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు.

అలాగే అన్ని పార్టీలు కూడా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు స్వాగతించాలని లేనిపక్షంలో వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలిపారు. ఒక ప్రాంతానికి వెళితే ఒక మాట మారుస్తున్నారని రాజకీయ పార్టీలో ఏకతాటిపై వచ్చి రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు