హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Job Mela: ఏపీలో ఎల్లుండి జాబ్ మేళా.. Axis Bank, Bajaj Capitalతో పాటు ఈ ప్రముఖ సంస్థల్లో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Job Mela: ఏపీలో ఎల్లుండి జాబ్ మేళా.. Axis Bank, Bajaj Capitalతో పాటు ఈ ప్రముఖ సంస్థల్లో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్. ఈ జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ కేపిటల్, డీమార్ట్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

D-Mart: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపకైన వారు అనంతపురంలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.10,414గా ఉంటుంది. వయస్సు 18-24 ఏళ్లు ఉండాలి.

NS Instruments India Pvt Ltd: ఈ సంస్థలో 80 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంపీసీఎస్, ఎంపీసీ, కంప్యూటర్స్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.13,700గా ఉంటుంది. వయస్సు 26 ఏళ్లలోపు ఉండాలి.

యాక్సిస్ బ్యాంక్: ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు అనంతపురం , తాడిపత్రి, కదిరి, ధర్మవరంలో పని చేయాల్సి ఉంటుంది. పనితీరు ఆధారంగా వేతనం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సు 18-36 ఏళ్లు ఉండాలి.

Bajaj Capital: ఈ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. డేటా సోర్సింగ్ ఆఫీసర్, క్లైయింట్ రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. ఇతర ఇన్సెంటీవ్స్&బోనస్ ఉంటుంది.

Seoyon E-HWA Summit: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.14,000 వేతనంఉంటుంది. టేక్ హోం రూ.11,800, బీటెక్, డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీకామ్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఇతర వివరాలు:

-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు - గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్-అనంతపురం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకవాల్సి ఉంటుంది.

- ఇతర వివరాలకు 8317520929 నంబర్ ను సంప్రదించవ్చు.

First published:

Tags: Job Mela, Private Jobs

ఉత్తమ కథలు