హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ananthapur: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జేేకేసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా

Ananthapur: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జేేకేసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా

మెగా జాబ్ మేళా

మెగా జాబ్ మేళా

Andhra Pradesh: అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే జవహర్ నాలెడ్జ్ సెంటర్లో ఈ సోమవారంజాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రస్తుతంఎక్కడ చూసినా నిరుద్యోగం పెరిగిపోయింది,

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(G.Venkatesh, News 18, Ananthapur)

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే జవహర్ నాలెడ్జ్ సెంటర్లో ఈ సోమవారంజాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిరుద్యోగ నోటిఫికేషన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది యువత వారు చదువును పూర్తి చేసుకొని బయటికి వస్తున్నారు.

కానీ అదే తరహాలో ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ఈ తరుణంలో నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోయింది. ఏ చిన్న జాబ్ ని వదిలిన హై క్వాలిఫికేషన్ ఉన్నవారు మరియు లక్షలలో అభ్యర్థులు వాటికోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎక్కడ జాబ్ మేళా నిర్వహించిననిరుద్యోగుల వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ తరుణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో జవహర్ నాలెడ్జ్ హబ్ లో నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ కామర్స్, గ్రాఫిక్స్ డిజైన్, కస్టమర్ సపోర్ట్, అప్లై స్టోర్ కాల్స్, డిజిటల్ మార్కెటింగ్ తదితర విభాగాలలో ఉద్యోగాల కోసం జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ విభాగాలలో ఆసక్తికర కలిగిన వారు, అర్హత కలిగిన వారు జాబ్ మేళాకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూలోపాల్గొనే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు. డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Job, Local News

ఉత్తమ కథలు