G Venkatesh, News18, Anantapuram
జేసి దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) అనంతపురం జిల్లా (Anantapuram District) లో ఈ పేరు తెలియని వారు ఉండరు. రాజకీయంలో ఆయన తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. జేసి దివాకర్ రెడ్డి ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అంతే చాతుర్యంకలిగిన వ్యక్తి. ఎవరైనా సొంత పార్టీ వారు చేసే కార్యక్రమాలపై ఏదైనా అభిప్రాయాన్ని వెల్లడించాలంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) లో నారా లోకేష్ (Nara Lokesh Padayatra) చేపట్టే పాదయాత్ర ఉపయోగం లేదని చెప్పాలంటే అది చేసి దివాకర్ రెడ్డికే సాధ్యపడుతుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి కొనసాగారు.
రాష్ట్ర విభజనకు ముందు జేసీ దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి జేసీ దివాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 సంవత్సరంలో కొడుకుని ఎమ్మెల్యేగా తాడిపత్రి నియోజకవర్గ నుంచి పోటీ చేయించాడు. కానీ కొడుక పవన్ ఓటమిపాలయ్యాడు.
రాష్ట్ర విభజన సమయంలో కూడా రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాయలసీమలోని జిల్లాలను కూడా తెలంగాణలో కలపాలని కోరారు. తాజాగా ఇదే డిమాండ్ ను జేసీ దివాకర్ రెడ్డి లేవనెత్తారు. అయితే లోకేష్ పాదయాత్ర పై మాట్లాడుతూ.., పాదయాత్రలకు కాలం చెల్లిందని కూడా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ (Telangana) లో టీపీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), ఏపీలో లోకేష్ పాదయాత్రల గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ పాదయాత్రలు చేసినా లాభం లేదన్నారు. ఇప్పుడు మొత్తం డబ్బుతో కూడిన పాదయాత్రలేనని జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా నిర్మొహమాటంగా తెలియజేయడంలోజేసి ఫ్యామిలీ ప్రత్యేకతనే వేరు..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, JC Diwakar Reddy, Local News, Nara Lokesh