హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

గోమాతకు ఇస్కాన్ అండ.. అక్కడ ప్రశాంతతే వేరు

గోమాతకు ఇస్కాన్ అండ.. అక్కడ ప్రశాంతతే వేరు

X
అనంతపురంలో

అనంతపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల

ISKON: సాధారణంగా గోశాలలు అంటే ఎవరికైనా మక్కువే.. అదే గోశాలలను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఆవుతో పాటు ఆవు నుంచి వచ్చే మలమూత్రలకు ప్రస్తుతం అంతే డిమాండ్ ఉంది. అంతే శ్రద్దతో ఆవును కూడా పూజిస్తారు. మరి ఇలాంటి గోశాలలు మనకు దగ్గరలోనే ఉంటే...ఆవును నిత్యం పూజించేందుకు మరింత వీలు అవుతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

సాధారణంగా గోశాలలు అంటే ఎవరికైనా మక్కువే.. అదే గోశాలలను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఆవుతో పాటు ఆవు నుంచి వచ్చే మలమూత్రలకు ప్రస్తుతం అంతే డిమాండ్ ఉంది. అంతే శ్రద్దతో ఆవును కూడా పూజిస్తారు. మరి ఇలాంటి గోశాలలు మనకు దగ్గరలోనే ఉంటే...ఆవును నిత్యం పూజించేందుకు మరింత వీలు అవుతుంది. ఇప్పుడు మన అనంతపురంలో ఇలాంటి గోశాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలు చూడండి.. అనంతపురం (Anantapuram) నగరం విన్సెంట్ ఫెర్రర్ రోడ్డులో ఇస్కాన్ (ISKON) వారి ఆధ్వర్యంలో ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. ఇస్కాన్ వారు ఇక్కడ గోశాలను ఏర్పాటు చేసి, గోవులను పోషిస్తుంది. ఇక్కడ దాదాపుగా 350 నుంచి 370 గోవులున్నాయి.

ఈ గోమాతలకు ప్రతిరోజు సేవలు చేయడానికి ఇక్కడ 15 మంది వరకు పని చేస్తూ ఉంటారు. ఆవుల పో,షణకు కావాల్సిన మేతను వేస్తూ శ్రద్దగా చూస్తుంటారు. పరిశుభ్రంగాపాలు పితకడం మరియు దొడ్డిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం చేస్తుంటారు. ఇక్కడ గోవుల ద్వారా వచ్చిన పేడతో పిడకలు చేసి వాటిని కూడా ఉపయోగిస్తారు. ఎవరైనా వైద్యుడు పర్యవేక్షణలో గోశాలకు గోవును ఇవ్వచ్చు. ఈ గోమాతల పోషణకు కావాల్సినపచ్చ గడ్డిని పెంచుతూ ఉన్నారు పట్టణ శివారులో. పచ్చి గడ్డిని ప్రతిరోజు కోసి ట్రాక్టర్ సహాయంతో ఈ గోశాలకు తీసుకువచ్చి గోవులకు మేతగా వేస్తారు.

ఇది చదవండి: విశాఖ పోలీస్ వినూత్న కార్యక్రమం.. ఇకపై నేరుగా ఫోన్ చేయవచ్చు

గోశాలలో ఆవు, దూడ కలిసిన విగ్రహం ఎంతో సుందరంగా ఉంటుంది. ఇక్కడే దేవస్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు గోవు నుంచిసేకరించిన పాలనుఅనంతపురం పట్టణంలోని ఇస్కాన్ దేవస్థానానికి చేరవేస్తారు ఈ పాలతోనే వేన్న, నెయ్యి ,పెరుగు తయారుచేసి దేవస్థానంలోని ప్రసాదాలకి మరియు ఇతర పూజా కార్యక్రమానికి ఉపయోగిస్తారు. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నఈ గోశాలలో గోవులను అత్యంత పవిత్రంగా చూసుకుంటూ, వాటి ద్వారానే సేకరించిన స్వచ్ఛమైన పాలను దేవస్థానానికి ఉపయోగిస్తారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు