హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కార్పొరేట్ కాలేజీల్లో చదువులే కాదు.. వేధింపులు కూడా ఎక్కువే..!

కార్పొరేట్ కాలేజీల్లో చదువులే కాదు.. వేధింపులు కూడా ఎక్కువే..!

X
అనంతపురం

అనంతపురం జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య

Anantapuram: పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజీలకు పంపుతుంటారు. కానీ ఫీజులు కట్టినంతసేపు బాగానే ఉంటుంది.. పైసా తేడా వస్తే మాత్రం ప్రాణాలు తోడేయడం ఖాయం. అలాంటి విద్యార్థిని కథే ఇది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadiri | Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజీలకు పంపుతుంటారు. కానీ ఫీజులు కట్టినంతసేపు బాగానే ఉంటుంది.. పైసా తేడా వస్తే మాత్రం ప్రాణాలు తోడేయడం ఖాయం. అలాంటి విద్యార్థిని కథే ఇది. అనంతపురం (Anantapuram) నగరంలోని నారాయణ జూనియర్ కాలేజీలో ద్వితీయ ఏడాది చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యయత్నంచేసింది. కాలేజ్ మూడవ అంతస్తు నుంచి దూకింది. అమ్మాయిని మొదట సవేరా హాస్పిటల్ కు తరలించి, తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించారు. విద్యార్థి శ్రీ సత్య సాయి జిల్లా (Sri Satya Sai District) కదిరికి చెందిన సదాశివం, జ్యోతి దంపతుల కుమార్తె .వీరు కుటుంబం సమేతంగా అనంతపురం పాతూరులో నివాసం ఉండేవారిని తెలుస్తోంది. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన అమ్మాయి...తల్లిదండ్రులు బెంగళూరుకి వలస వెళ్లి జీవనం కొనసాగించేవారు.

అయితే కళాశాల యజమాన్యం ఫీజులు కట్టాలని ఒత్తిడికి గురి చేశారని దానితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని( భవ్య శ్రీ ) విద్యార్థినితెలిపింది. రికార్డు ఫీజు కట్టాలని కళాశాల సిబ్బందిఒత్తిడి చేశారని బాధితురాలు తెలుపుతోంది. రూ.12,000 చెల్లించాల్సి ఉన్న 10,000 రూపాయలు చెల్లించామని చెప్పారు. కానీ ఇంకా 850 ఇతర ఫీజులను చెప్పి మొత్తం 2850 వ రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేశారని విద్యార్థిని వెల్లడించారు.

ఇది చదవండి: భార్యతో గొడవ.. అల్లుడిపై అత్తింటివారు చేసిన దారుణం ఇది..!

అయితే విద్యార్థి మాట్లాడుతూ... తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి సరిగా లేదని ఇలా ఒత్తిడి చేయడం వల్ల తాను ఘటనకు పాల్పడాల్సి వచ్చిందని తెలిపారు. అందుకే పైనుంచి కిందికి దూకనాని విద్యార్థి తెలుపుతోంది. ఈప్రైవేటు విద్యాసంస్థలు. ప్రతి విషయానికి ఫీజులు వసూలు చేస్తూ ఆబ్సెంట్ అయినా ఫైన్ లువసూలు చేయడం, మరియు రికార్డు ఫీజ్ అని ప్రాక్టీకల్ ఫీజుల అనివిద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో సంబంధం లేకుండా ఒత్తిడికి గురిచేస్తూ ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.. వీటిపై ప్రభుత్వం కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. అయితే ఈ ఘటనపై యజమాన్యం స్పందిస్తూ తాము ఎలాంటి ఒత్తిడి గురి చేయలేదని చెబుతున్నారు. వారి కుటుంబ సమస్యల వల్లే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని యజమాన్యం తెలుపుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు