Breaking News: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కు గాయాలు అయ్యాయి. ఆయన రెండు భుజాలకు గాయాలయ్యాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ గాయాలు అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే..? నిన్న యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)లో పర్యటిస్తున్న లోకేష్ ను కలిసేందుకు పెద్దయెత్తున కార్యకర్తలు, టీడీపీ అభిమానులు గుంపులుగా తరలి వచ్చారు. అందులోనూ అప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (MLC Elections Result) తో పుల్ జోష్ లు కార్యకర్తలు లోకేష్ ను కలిసేందుకు భారీగా పోటీ పడ్డారు. దీంతో తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తల తోపులాటలో గాయాలయినట్లు తెలుస్తోంది. టీడీపీ శ్రేణులను నిలువరించడంలో ఇటు పోలీసులు, అటు లోకేష్ పాదయాత్ర వెంటే ఉన్న అనుచరులు కూడా విఫలమయ్యారు. ఈ రోజు లోకేష్ కు అయిన గాయాలను పరిశీలించి వైద్యం అందించనున్నారు. ఇప్పటికే కొందరు వైద్యులు లోకేష్ దగ్గరకు చేరుకున్నారు. అయితే లోకేష్ మాత్రం గాయాలను లెక్క చేయకుండా పాదయాత్రను అనంతపురంలో కొనసాగిస్తున్నారు.
మరోవైపు కదిరి నియోజకవర్గం చీకటిమానుపల్లి కేంద్రం నుంచి 46వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ఆయన ఉమ్మడి అనంతరం జిల్లాలోకి ప్రవేశించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు పాదయాత్ర సాగగా.. 46వ రోజు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. కదిరి నియోజకవర్గం చీకటి మానుపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలైంది.
నిన్న సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా లోకేష్ కు టీడీపీ శ్రేణులు భారీగా ఘనస్వాగతం పలికారు. అయితే తాజా గాయాల నేపథ్యంలో ఆయన పాద యాత్రకు బ్రేక్ పడుతుందని టీడీపీ శ్రేణులు భావించారు. వైద్యులు సైతం విరామం తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే లోకేష్ మాత్రం పాదయాత్రను తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ లెక్క తప్పిందా? 175కి 175 సాధ్యమా? అంతర్మథనంలో వైసీపీ నేతలు
ఇవాళ ఉదయం శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులోని చీకటిమానిపల్లి నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. శ్రీసత్యసాయి జిల్లాకు చేరుకున్న లోకేష్ పాదయాత్రకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనతోపాటు స్వాగతం పలికారు. రాత్రి చీకటిమానిపల్లి, గంగసానిపల్లి మధ్యలో ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ లో బస చేశారు లోకేశ్. ప్రస్తుతం లోకేష్ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుంది. దారిపొడవునా జనంతో మమేకమవుతున్నారు లోకేష్.
ఇదీ చదవండి : మెగా బ్రదర్స్ మధ్య కషాయ చిచ్చు.. ఏపీలో బీజేపీ వ్యూహం వర్కౌట్ అయ్యేనా..?
ఆప్యాయంగా పలకరిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అయితే భుజాలకు గాయం కావడంతో కాయన పాదయాత్రలో కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తున్నారు. మరోవైపు తాజా ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సహం నింపాయి. అనంతపురం నుంచి భారీగా పట్టభద్రులు టీడీపీకి ఓటు వేశారు. దీంతో లోకేష్ సైతం మరింత జోష్ లో పాదయాత్రను కొనసాగించాలి అనుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP