(G.Venkatesh, News 18, Ananthapur)
శ్రీ సత్య సాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో గాంధీనగర్ రైల్వే వంతెన వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలోనే ధర్మవరంకి పట్టు చీరలకు ఎంతో ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అనేకమంది చేనేత వృత్తిని చేస్తూ ఉంటారు. వారి జీవనాధారంగా చేనేత వస్త్రాలను వేయడం కొనసాగుతోంది.
ఈ మధ్యకాలంలో పెట్టుబడి పెరిగిపోవడంతో తగిన లాభాలు లభించడం లేద.చేనేత వస్త్ర పరిశ్రమ కుదేలు అయిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని సిద్ధయ్యగుట్ట కాలనీకి చెందిన జింకా హరీష్ (26) అనే చేనేత వృత్తి చేస్తూ ఉండేవాడు.గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్ళాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. శుక్రవారం రైల్వే ట్రాక్పై తల,మెుండెంవేరుగా పడి ఉండడం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ గోపీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మృతుడు హరీష్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేనేత మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న అతను మూడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు పడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. హరీష్ కు ఇంకా పెళ్లి కాలేదు. అతనికి సోదరుడు చంద్రమోహన్ తల్లిదండ్రులు లలితమ్మ రామాంజనేయులు ఉన్నారు. కరోనా సమయంలో ముడిపట్టు ధరలు పెరగడం, నేసిన పట్టు చీరలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైలు కిందపడి హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, రూ.10 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని సోదరుడు చంద్రమోహన్ తెలిపారు.
అప్పులు ఇచ్చిన వారు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో రైలు కిందపడి బలవన్మరణం చెందాడని పేర్కొంటున్నారు. అయితే హరీష్ మృతి దేహాన్ని చూసి తల్లిదండ్రులు సోదరుడు ఎంతో కృంగిపోయారు ఆ కుమారుడి మరణాన్ని వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు .రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News