G.Venkatesh, News 18, Ananthapur
అనంతపురం జిల్లాలోని సింగనమల కస్తూరిబా విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కేజీబీవీ సింగనమల పాఠశాలలో దాదాపుగా 258 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడే వసతి మరియు కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు, చుట్టుపక్కల గ్రామంలోని పేద పిల్లలకు ఇక్కడ చదువుకోవడానికి మంచి అవకాశం. అయితే అకస్మాత్తుగా దాదాపు 80 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు.ఏమైందో తెలియని అయోమయంలో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
అయితే విద్యార్థులు 40 మంది ఎక్కువ ఇబ్బంది పడడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే వారిలో 20 మందికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది.దీనితో వారి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏమైందో అని చాలా ఆందోళనలకు గురయ్యారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం భోజనంతో పాటు మజ్జిగ తీసుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. మొదటగా మజ్జిగలో ఏదైనా ఇబ్బంది కలిగిందేమో అని అందరు అనుకున్నారు.
కానీ సాయంత్రం 4:15 4:20 మధ్య బూస్ట్‌తో కలిపిన పాలు, మరియు బొరుగులు ఇచ్చాారని... అందరు బొరుగులు తిన్నామని తెలియజేశారు.అయితే సాయంత్రం స్నాక్స్ తిన్న తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, మోషన్స్, కళ్ళు తిరగడం, వాంతులు అవడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఫస్ట్ ఎయిడ్ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి హాస్టల్ ఇన్చార్జ్ తరలించారు. అయితే ఈ కళాశాలలో 14 మంది వరకు టీచర్స్ పనిచేస్తూ ఉంటారు అయితే సాయంత్రం నాలుగున్నర వరకు అందరూ ఉంటారు. తరువాత రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్కరు ఒక్కరోజు ఇన్చార్జిగా తీసుకుంటారు. ఈ సంఘటనతో జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు కళాశాలన్నీ సందర్శించి, ఫుడ్ పాయిజన్ అయిందా అయితే ఎందువల్ల అయింది, మరియు వాటికి సంబంధించిన ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ వారు ల్యాబ్ కి పంపించారు.
అయితే ఎక్కువగా సాయంకాలం తీసుకున్న బోరుగులు, బూస్ట్ ద్వారానే ఉంటుందని చెబుతున్నారు. అయితే వారి పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు వసతి గృహాలు ఎలా ఉన్నాయని ఒకసారి న్యూస్ 18 ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ విద్యార్థికి ఎటువంటి అపాయం కూడా జరగలేదు అందరూ ఆరోగ్యంతో ఉన్నారు. ఇలాంటివి తర్వాత జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News