Home /News /andhra-pradesh /

ANANTAPURAM HUSBAND TRY TO KILL WIFE FOR SELLING THEIR PROPERTY IN ANNAMAYYA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Wife And Husband: భర్తకు తెలియకుండా అస్తిని అమ్మేసిన భార్య.. అసలు నిజం తెలిసి భర్త ఏం చేశాడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chittoor News: ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దలు వివాహం కుదిర్చినా నేటి కాలంలో ఒక్కసారి జంట మధ్య కలహాలు రేగితే కలసి వెళ్లే తత్వం లేకుండా పోతుంది. గొడవలతో దూరం అయిన ఓ జంట... వేర్వేరుగా కాపురం ఉంటున్నారు.

    GT Hemanth Kumar, News18, Tirupati

    పెళ్ళిలో ఒక్కటైన భార్యభర్తలది పవిత్ర బంధంగా భావిస్తారు పెద్దలు. వాళ్లిద్దరూ కానీ కొన్ని జంటలు కోపం., క్రోధంతో వేర్వేరుగా ఉంటూ ఒకరిపై మరొకరు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ దాడులు చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దలు వివాహం కుదిర్చినా నేటి కాలంలో ఒక్కసారి జంట మధ్య కలహాలు రేగితే కలసి వెళ్లే తత్వం లేకుండా పోతుంది. గొడవలతో దూరం అయిన ఓ జంట... వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. పిల్లలను తన వెంట ఉంటడంతో తన పేరు మీద ఉన్న ఆస్థిని అమ్మేసింది ఆ వివాహిత. తాను సంపాదించిన ఆస్తిని స్వాహా చేస్తుందన్న నెపంతో ఆ కానిస్టేబుల్ ఏంచేసాడో తెలిస్తే.... ఇంత నీచంగా ఉన్నారన్న అనుకోక మానరు.

    వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సత్యసాయి జిల్లా (Sri Satyasai District) ధర్మవరం పట్టణానికి చెందిన రామలింగయ్యకు అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంకు చెందిన శ్రీవల్లి కొన్నేళ్ల క్రిందట పెద్దలు కుదిర్చిన వివాహం ద్వారా ఒక్కటైయ్యారు. రామలింగయ్య సెబ్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి వివాహ జీవితానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో సాఫీగా సాగుతున్న వీరి జీవితం కలహాల కాపురంగా మారింది. తరచూ గొడవలు పడుతూ.. ఇక కలసి ఉడలేమని భావించిన భార్య 2018లో భర్త రామలింగయ్యపై వరకట్నం., మెయింటినెన్స్ కేసును కోర్టులో దాఖలు చేసింది..

    ఇది చదవండి: ప్రేమ వ్యవహారం లేదు.. పని ఒత్తిడి లేదు.. యువతి ఆత్మహత్యకు కారణం తెలిసి షాకైన పోలీసులు..


    అప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్న బార్యాభర్తల మధ్య మరింత వివాదం మరింత ముదిరింది. ఇద్దరు పిల్లల పోషణ కష్టతరంగా మారిన శ్రీవల్లి తన పేరు మీద ఉన్న స్థలాన్ని విక్రయించింది. తాను సంపాదిచిన ఆస్తిని తన భార్య ఎలా అమ్ముకుంటుందని మరింత ఆగ్రహానికి గురైన రామలింగయ్య... తన ఆస్థి దక్కించుకోవడం కోసం పథకం రచించాడు. భార్య అడ్డు తొలగితే ఆస్థి అంతా తనకే వస్తుందని భావించాడు.



    పథకంలో భాగంగా ఓ ముఠాను రంగంలోకి దించాడు. రెండు రోజుల క్రితం శ్రీవల్లి మదనపల్లె కోర్టుకు వస్తుండగా కొంతమంది మార్గమ మధ్యలో అడ్డగించారు. ఆమెపై దాడి చేయబోతుండగా శ్రీవల్లి తప్పించుకొని పారిపోయింది. తనను చంపేందుకు భర్తే పథకం వేశాడని తనకు రక్షణ కల్పించడంతో పాటు భర్తపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రామలింగయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు