హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sad Story: ప్రేమ పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నారు.. కానీ ఈ ముచ్చటైన జంట ఇప్పుడు లేరు.. ఏం జరిగిందంటే..!

Sad Story: ప్రేమ పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నారు.. కానీ ఈ ముచ్చటైన జంట ఇప్పుడు లేరు.. ఏం జరిగిందంటే..!

గణేశ్, గగనశ్రీ (ఫైల్)

గణేశ్, గగనశ్రీ (ఫైల్)

Anantapuram: వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనా పెద్దలకు నచ్చకున్నా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ విధి వాళ్ళతో వింత నాటకం ఆడింది. కలకాలం జీవించాల్సిన భార్యాభర్తలను చావు కబళించి ఇద్దరినీ వేరు చేసింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  GT Hemanth Kumar, News18, Tirupati

  వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనా పెద్దలకు నచ్చకున్నా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ విధి వాళ్ళతో వింత నాటకం ఆడింది. కలకాలం జీవించాల్సిన భార్యాభర్తలను చావు కబళించి ఇద్దరినీ వేరు చేసింది. ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. డెంగ్యూ రూపంలో భార్యను మృత్యువు తన ఒడిలో చేర్చుకుంటే... ప్రేమ, అనురాగాలు దూరమై.., అత్త మామల సూటిపొటి మాటలు పడలేని ఆ యువకుడు మరణ పాన్పు ఎక్కాడు. కఠినాత్ములకు సైతం కన్నీళ్లు తెప్పించే కన్నీటి గాధ ఇది. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) కల్యాణదుర్గం శంకరప్ప తోట కాలనిలో నివాసం ఉంటున్నాడు గణేష్ (25). తన సామజిక వర్గం., సమీప బంధువు అయినా గగనశ్రీ(22)ని ప్రేమించాడు.

  రెండేళ్ల క్రితం గగనశ్రీ మంగళూరులో బిటెక్ చదువుతున్న సమయంలోనే గణేష్ ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు మంగళూరులోనే ఉండేవాళ్ళు. కుమార్తె వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో గగనశ్రీ అక్కడే ఉండగా గణేశ్ స్వగ్రామానికి వచ్చేశాడు. తన తల్లిదండ్రులకు తెలియకుండా గగన శ్రీ ఐదు నెలల క్రితం భర్త వద్దకు వచ్చింది.

  ఇది చదవండి: నెల్లూరులో జర్నీ సీన్ రిపీట్..! రెండు బస్సులు ఢీ.. మధ్యలో లారీ..!

  ఈ నెల 6న జ్వరంతో కళ్యాణదుర్గం పట్టణం నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో చికిత్స చేయించగా డెంగీ జ్వరం అని నిర్ధారించారు వైద్యులు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు గగనశ్రీని తరలిస్తున్న సమయంలో మృతి చెందింది. మృతి చెందే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి. తమ కుమార్తెను భర్త, అత్తమామలే చంపారని మృతురాలి తండ్రి కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దారు, పోలీసులు విచారణ చేపట్టి ఆమె మృత దేహానికి పంచనామా నిర్వహించారు.

  ఇది చదవండి: ఏడో తరగతి బాలికకు 30ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. అంతలోనే ఘోరం జరిగిపోయింది..!

  ఇక గగనశ్రీ తల్లితండ్రులే స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. తన భార్యను తానే చంపానని కేసు నమోదు చేశారని, ఆమె చివరి చూపు కూడా చూడనీయలేదని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేని జీవితం వ్యర్థమని భావిచిన గణేష్ జీవితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

  గణేష్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గణేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గణేశ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Suicide

  ఉత్తమ కథలు