హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పోలీస్ అవుదామని వెళ్లింది.. తీరా ఆ పోలీసుల చేతుల్లోనే..!

పోలీస్ అవుదామని వెళ్లింది.. తీరా ఆ పోలీసుల చేతుల్లోనే..!

సత్యసాయి జిల్లాలో యువతిపై హోంగార్డు అత్యాచారయత్నం

సత్యసాయి జిల్లాలో యువతిపై హోంగార్డు అత్యాచారయత్నం

అమ్మాయిలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై అఘాత్యానికి పాల్పడిన సంఘటన తాజాగా అనంతపురం జిల్లా (Anantapuram District) లోని కదిరి మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadiri | Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది, ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు మరియు ఇతర సంఘటనలకు పాల్పడుతున్నారు. ఎక్కడ చూసినా వారి భద్రత కరువైంది. ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లా (Anantapuram District) వ్యాప్తంగా అమ్మాయిలు మిస్ అవుతున్న సంఘటనలో జరుగుతూ ఉన్నాయి. అయితే అమ్మాయిలకి రక్షణ కరువైంది. కాలేజీకి వెళ్లాలన్నా, జాబ్ లోకి వెళ్లాలన్నా, బయట ఎక్కడికైనా తిరగాలన్న కూడా ఎక్కడ కూడా అమ్మాయిలకి భద్రత లేకుండా పోయింది. అయితే అమ్మాయిలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై అఘాత్యానికి పాల్పడిన సంఘటన తాజాగా అనంతపురం జిల్లా (Anantapuram District) లోని కదిరి మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది.

అయితే ఈ పరీక్షకు హాజరైన ఒక అమ్మాయిపై పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళలను రక్షించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిన సంఘటన కదిరి పట్టణంలో చోటుచేసుకుంది. అయితే ఆదివారం కానిస్టేబుల్ పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లడానికి అమ్మాయి రైల్వే స్టేషన్ కు చేరుకుంది.

అక్కడ కానిస్టేబుల్ కాయప్ప, హోంగార్డు సుబ్బారెడ్డి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తప్పించుకొని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  వెలుగులోకి వచ్చింది. సమాజంలో అమ్మాయిలకి మహిళలకి రక్షణ లేకుండా పోయింది. శాంతిభద్రతలను కనిపించాల్సిన పోలీసులే ఇలాంటి అత్యాచారాలకు పాల్పడితే, సామాన్యులపరిస్థితి ఏంటిదని ప్రజలు తెలుపుతున్నారు.

ఇది చదవండి: చిన్నపాటి జాగ్రత్త మీ ప్రాణాలను కాపాడుతుంది.. మీరు చేయాల్సింది ఇదే..!

ఇలాంటి పోలీసులు ఉండడం నిజంగా పోలీస్ వ్యవస్థకే మచ్చల నిలుస్తోంది, ఇంకా మహిళలు రక్షణ కావాలంటే ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని అయోమయంలో పడిపోయారు. ఇలాంటి వారిని అసలు క్షమించకూడదని, తగిన శిక్ష వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి ఇలాంటి దారుణమైన సంఘటనలు పాల్పడితే  వారికి  భద్రత ఎక్కడని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Crime news, Local News

ఉత్తమ కథలు