G Venkatesh, News18, Anantapuram
ఎందరో గొప్పగొప్ప రాజులు పాలించిన రాజ్యాలు మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో పెనుగొండ కోట ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. ఇక్కడ విజయనగర రాజులు పాలించారు. హంపి తర్వాత రెండవ రాజధానిగా చేసుకొని పెనుగొండను పాలించారు. సుల్తానులతో యుద్ధం తరువాత విజయ నగర రాజులు పెనుగొండలో స్థిరపడి ఇక్కడి నుండే పరిపాలించారు. విజయనగర రాజుల కాలంలో రోడ్డుకిరువైపులా రత్నాలు ముత్యాల రాసులుగా పోసి వ్యాపారం చేసేవారు అని చెప్తారు. పెనుగొండ కోటలోకి మనం పెనుగొండ కోట ముఖద్వారం వద్ద నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ ముఖ ద్వారం వద్ద ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. మరియు హిందూ దేవాలయాలతో పాటు జైన మతం సంబంధించిన టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది జైన మతస్థుడుపారశ్వనాథుడు దేవాలయం. దీన్ని బట్టి చూస్తే విజయనగర రాజులు జైన మతంను కూడా ప్రోత్సహించారని తెలుస్తోంది. విజయనగరం రాజు అయిన వీరనరసింహరాయల కాలంలో తిమ్మరసు ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే రాజు కుమారుడుని హత్య సంఘటనలో కుట్రపూరితంగా తిమ్మరుసును వాటిలో భాగం చేసి జైలుకు పంపిస్తారు.
తిమ్మరుసు రెండు కళ్ళు తీసి జైల్లో బంధిస్తారు. దీనిని తిమ్మరసు బందీఖాన అంటారు. తరువాత తిమ్మరసు ప్రమేయం లేదని తెలిసి రాజు ఎంతో చింతిస్తారు. మరియు అతనిని విడుదల చేస్తాడు.మంత్రిని బంధించిన బందీఖానను మనం ఇక్కడ చూడవచ్చు. బందీఖానా పక్కనే నీటి కొలను ఏర్పాటు చేశారు.అప్పటి కాలంలో అక్కడి నుంచి నీటినితీసుకుని వెళ్లేవారని తెలుస్తోంది. మరియు ఇక్కడ బసవన్న బావి కలదు. ఈ బావి పక్కన ఎత్తయిన నంది విగ్రహం కూడా కలదు. అది చూడటానికి చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఆ కాలం నాటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు.
ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ నిర్మించిన గగన్ మహల్ గురించి....ఇది ఆకాలంలోనే రెండంతస్తుల మేడగా నిర్మించారు... అప్పటి రాజులు రాణులకి ఇది వేసవి విడిదిగా ఉండేదని ఇక్కడి చరిత్ర చెపుతుంది. మరియు గగన్ మహల్లో రాజదర్బార్ కూడా నిర్వహించేవరని తెలుస్తుంది. ఆ కాలంలో భోగాపురం చెరువు నుండి ప్రజలు నీరు తీసుకెళ్లేవారు అని చెబుతుంటారు.
ఈ చెరువు దగ్గర ఇప్పుడు శివుడి విగ్రహం చాలా అద్భుతంగా నిర్మించారు. చూసేందుకుచాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఆకర్షిస్తూ కనువిందు చేస్తూ ఉంటుంది. కొండపైన నిర్మించిన కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని పునరుద్ధరించి కొండపైకి రహదారి ఏర్పాటు చేయాలని ఇక్కడ పర్యాటకులు అధికారులను కోరుతున్నారు. ఇంతకుముందు శ్రీ కృష్ణదేవరాయలు ఉత్సవాలు పెనుగొండలో ఘనంగా నిర్వహించే వారు కానీ తర్వాత నుంచి నిర్వహించలేదు. ఇప్పుడైనా అధికారులు స్పందించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News