Nandamuri Balakrishna: హిందూపూరం (Hindupuram) ఎమ్మెల్యే.. నటుడు బాలకృష్ణ (Balakrishna) ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాల షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. విరామ సమయాల్లో అన్ స్టాప్ బుల్ 2 (Unstoppable 2) షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ రెండు కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. ఏ మాత్రం సమయం వచ్చిన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో (Flood Effected Areas) బాలయ్య పర్యటించారు. అక్కడే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. స్థానిక పరిస్థులను స్వయంగా పరిశీలించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు అందర్నీ ఆదుకుంటామని తెలిపారు.
హిందూపురాన్ని ఆనుకుని ఉన్న చౌడేశ్వరి కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే మళ్లీ తుఫాను హెచ్చరిక ఉండడంతో హిందూపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారందరికీ భరోసా కల్పించారు బాలయ్య.. స్వయంగా వారి కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
19 October 2022 https://t.co/jMi2qSNCfG via @YouTube #NBK #NBK107 #NBK108 #nbk109 #NandamuriBalakrishna #flooding @NBK_Unofficial @BalayyaUvasena @NBKTrends
— nagesh paina (@PainaNagesh) October 19, 2022
మరోవైపు ఓ అభిమాని ప్రాణాలు తెగించి చేసిన ఓ పని వైరల్ అవుతోంది. బాలకృష్ణ గురించి సినీ ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అభిమానులకు ఆయనంటే ఎంతో పిచ్చో అస్సలు చెప్పాల్సినవసరం లేదు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే.. ఆయనను చూడడానికి, తాకడానికి అభిమానులు రిస్కులు చేసారు. తాజాగా ఒక బాలయ్య అభిమాని తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
That's it he wants to meet #NANDAMURIBALAKRISHNA #HINDUPURMLA #CRAZYFAN #NBKFANS pic.twitter.com/VSYUgN5vJi
— GOPI NALLAPANENI (@gopi9999) October 18, 2022
ఈ వీడియోలో వరద ముంపు ప్రాంతాలనుఅధికారులతో కలిసి బాలయ్య ప్రర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆయనను చూడడానికి అభిమానులు పోటెత్తారు.. అక్కడ నీటి కట్ట వరదల వలన ఒక వంతెన కుప్పకూలిపోయింది.
వంతెన ఒక సైడ్ కొంతమంది ప్రజలు ఉండగా.. మరో సైడ్ బాలయ్య ఉన్నాడు. మధ్యలో వరద నీరు పారుతోంది. ఇక వంతెన ముందు భాగంపై ఉన్న ఒక అభిమాని, తన అభిమాన హీరోను కలవాలని చెప్పి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిలోకి దూకాడు.. అయితే ఈ ఒడ్డుకు రాలేక ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు.
ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. వైద్య రంగంలో మరో సంచలన నిర్ణయం.. 21 నుంచి అమలు
ఈ ఊహించని ఘటనతో అక్కడ ఉన్నవారందరూ భయబ్రాంతులయ్యారు. చివరకి సదురు అభిమానిని మరికొందరు కాపాడినట్లు తెలుస్తోంది. అభిమాన హీరోను చూడడం కోసం కొన్ని రిస్క్ లు చేసినా పర్లేదు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొనే పనులు చేయకూడదని ఈ వీడియో చూసిన వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP Floods, AP News, Bala Krishna Nandamuri, Hindupuram