Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) మారింత వేడక్కాయి. చాలా చోటు రాజకీయంగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తాజాగా అనంతపురం క్లాక్ టవర్ (Anantapuram Clock Tower) దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోషల్ మీడియా (Social Medai) లో పోస్టుతో మొదలైన వివాదం ఘర్షణకు దారి తీసింది. వైసీపీ (YCP) మద్దతుదారుడు హరికృష్ణ క్లాక్ టవర్ దగ్గరకు చేరుకోవడంతో.. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. రాళ్లదాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు పోలీసులు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై (Prakash Reddy) టీడీపీ మద్దతుదారులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ఈ ఘర్షణకు కారణమైంది. ఇరు వర్గాల మద్దతు దారులు ధైర్యం ఉంటే అనంతపురం క్లాక్‌టవర్ సెంటర్ కు రావాలంటూ సవాల్ విసురుకున్నారు.
సోషల్ మీడియాలో సవాళ్లపై రెండు పార్టీల మద్దతు దారులు స్పందించారు.. క్లాక్ టవర్ దగ్గర తేల్చుకుందా రా అంటూ తొడలు కొట్టారు. రెండు వర్గాలు అక్కడకు చేరుకోవడంతో.. పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు.. ముందుగానే అక్కడకు చేరకున్నారు.
పోలీసులను తప్పించుకుని నేతలు ఒకరిపై ఒకరు ఘర్షణ పడటంతో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి : అరెస్టులు తప్పవా..? 10న అవినాష్ రెడ్డి, 12 భాస్కర్ రెడ్డి విచారణకు హాజరు
రాప్తాడులో అభివృద్ధి ఎవరి పాలనలో జరిగిందన్నదానిపై సోషల్ మీడియాలో మొదలైన చర్చే ఈ హై ఓల్టేజ్ కు ప్రధాన కారణం. ఒకరు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరికొందరు పరిటాల కుటుంబం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం వచ్చి మాట్లాడాలంటా టీడీపీ మద్దతుదారుడు సవాల్ విసిరాడు. తాను రాప్తాడు, అనంతపురం వచ్చానంటూ వైసీపీ మద్దతుదారుడు వీడియో రిలీజ్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. రాప్తాడులో పరిటాల వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిల మధ్య వార్ ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో మరింత ముదిరింది.
ఇదీ చదవండి : టీడీపీలో చేరిన ఆయన సీటు ఫిక్స్ చేసుకున్నారా..? ఆ మంత్రిపై పోటీకి సై అంటున్నారా..?
తాజాగా రెండు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ నేత గొప్ప అంటే తమ నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకోవడంతో టెన్షన్ నెలకొంది. దీంతో ఇటు వైసీపీకి అనుకూలంగా వ్యక్తి తాను వస్తానంటూ నువ్ రా అంటూ ప్రతి సవాల్ విసిరాడు.
ఇదీ చదవండి : అరెస్టులు తప్పవా..? 10న అవినాష్ రెడ్డి, 12న భాస్కర్ రెడ్డి విచారణకు హాజరు
ఇవాళ రాప్తాడుకు సదరు గుంటూరు వ్యక్తి వచ్చాడు. తాను రాప్తాడు వచ్చాను.. మీ పరిటాల వారు దేవుని భూమి కబ్జా చేసి టీడీపీ కార్యాలయం కట్టిన విషయం చూడండి అంటూ వీడియో రిలీజ్ చేశాడు. అలాగే జాకీ పరిశ్రమ స్థలం వద్దకు కూడా వెళ్లి 150కోట్ల భూమిని జాకీకి ఇచ్చారని.. కనీసం ఇక్కడ పాకలు కూడా లేవంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇది మీ వాళ్ల నిజస్వరూపం.. అనంతపురం టవర్ క్లాక్ దగ్గరకు, రాప్తాడుకు వచ్చి చెబుతున్నానంటూ ఆ వ్యక్తి కామెంట్స్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ గుమికూడిన వారిని పోలీసులు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, AP Politics