Home /News /andhra-pradesh /

ANANTAPURAM HERO COM MLA NANDAMURI BALAKRISHNA TURNED A SCHOOL TEACHER IN HINUDPURAM NGS TPT

Balakrishna: టీచర్ గా మారిన బాలయ్య.. సోషల్ మీడియాతో కాలక్షేపంపై తనదైన స్టైల్లో వార్నింగ్

టీచర్ గా మారిన బాలయ్య

టీచర్ గా మారిన బాలయ్య

Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. తనదైన స్టైల్లో విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.. సోషల్ మీడియాతో కాలక్షేపం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులకు అసలు ఆయన ఏం చెప్పారంటే?

 • News18 Telugu
 • Last Updated :
 • Hindupur, India
  Balakrishna: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandmuri Balakrishna) తన నియోజకవర్గం పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా (Ananatpuram District) లోని తన సొంత నియోజకవర్గం హిందూపూర్ (Hindupr)లో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడి బాల‌య్య స‌తీస‌మేతంగా వెళ్లారు. తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని సంకల్పించారు. అందుకే అందిరికీ ఉచితంగా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం (NTR Arogya Ratham) పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు. ఇక రెండో రోజు సైతం ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా సరికొత్త బాలయ్య కనిపించారు నియోజకవర్గ ప్రజలకు.. బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. ఉన్నట్టు ఉండి టీచర్ అవతారం ఎత్తారు. ఇవాళ హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు..

  ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. టీచర్ గా మారిన బాలయ్య తనదైన స్టైల్లో క్లాస్ కూడా తీసుకున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వైపు వెళ్లకండి.. ఫేస్‌బుక్‌ చూస్తూ కాలం వృథా చేయకుండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.

  https://telugu.news18.com/web-stories/movies/nani-and-ram-rejected-sita-ramam-movie-sb-sb/index.html

  హిందూపురంలో అంధుల పాఠశాలను, నవోదయ విద్యా సంస్థను తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్న ఆయన.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.. సోషల్ మీడియా వైపు వెళ్లకుండా మంచి సందేశాన్నిచ్చే సినిమాలను చూడాలి.. ఫేస్‌బుక్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి అని సూచనలు చేశారు.

  ఇదీ చదవండి : బాలయ్య అంటే ఇది.. అభిమాని ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్.. ఏం చేశారో చూడండి..

  ఈ సందర్భంగా అధికార పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్లు అధ్వాన స్థితిలో ఉంటే చివరకు గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తన తొలిరోజు పర్యటనలో.. అందిరికీ ఉచితంగా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు బాలయ్య.. హిందూపురం మండలం చలివెందులలో ఈ ఆరోగ్య రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తామని తెలిపారు.. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందిస్తుందని వెల్లడించారు.

  ఇదీ చదవండి : గాడిదలు కాస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..? ఆ పాలతో ఉపయోగాలెన్నో..?

  ప్రస్తుతం బాలయ్య హ్యాట్రిక్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. హిందూపురాన్ని తన కంచుకోటగా మార్చుకున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. కుదిరినప్పుడల్లా ఇలా స్థానికులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలను గుర్తించి.. సొంత నిధులతో సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hindupuram, Nandamuri balakrishna, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు