హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Heavy Rains: వరద ఉదృతికి వాగులో పడ్డ భారీ ట్యాంకర్.. డంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేసిన పోలీసులు? విషయం ఏంటంటే?

Heavy Rains: వరద ఉదృతికి వాగులో పడ్డ భారీ ట్యాంకర్.. డంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేసిన పోలీసులు? విషయం ఏంటంటే?

వాగులో కొట్టుకుపోయాన లారీ

వాగులో కొట్టుకుపోయాన లారీ

Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ను వానలు.. వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అయితే ఆకాశానికి చిల్లు పడిందా అనే లా వానలు కుమ్మేస్తున్నాయి. బుక్కరాయి వాగులో ఓ సిమెంట్ కొట్టుకుపోయింది.. డ్రండ్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు షాక్ తిన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

Heavy Rains: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వర్షాలు (Veavy Rains) ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా అంనతపురం (Anantapuram), కడప జిల్లా (Kadapa District) ల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక అనంపురం జిల్లాలో అయితే ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్ లో ఎడతెరిపి లేని వానలు కుమ్మేస్తున్నాయి. దీంతో  ఊళ్లు.. చెరువులు ఏకమయ్యాయి.. చాలా గ్రామాలు జల విలయంలో చిక్కుకున్నాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో  అనంతపురం నగరానికి   తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది..

మరోవైపు  జిల్లాలోని బుక్కరాయ సముద్రం చెరువు దగ్గర వాగులో లారీ ట్యాంకర్ కొట్టుకుపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువుకు వరద ప్రవాహం ఎక్కువైంది. అనంతపురం వైపు నుంచి వస్తున్న వరదకు మరువ కాలువ పొంగి ప్రవహిస్తుండగా, మరువ కాలువ దాటుతుండగా లారీ కొట్టుకుపోయింది. తిన్నాగా వెళ్లాల్సిన లారీ.. అలా వాగులోకి వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. డ్రైవర్ కు డ్రండ్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి.. డ్రైవర్ పీకలలోతు మద్యం సేవించినట్టు గుర్తించారు.

మరోవైపు  గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఫలితంగా అనంతపురం నగరంలోని లోతట్టు కాలనీలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి ప్రధానంగా నగరంలోని నడిమి వంక కాలువ నుంచి నీరు ఉదృతంగా పలు కాలనీలోకి చర్చికి వచ్చి జనావాశం మొత్తం జలమయమైంది దీంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇదీ చదవండి : చనిపోయిన తరువాత కూడా తండ్రిని హింసిస్తారా..? బాలయ్యపై తొలిసారి కొడాలి నాని ఫైర్

జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో వివిధ శాఖల అధికారులు నిమగ్నమయ్యారు నగరంలోని రంగస్వామి నగరంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక బోట్లతో ప్రజలను ఇళ్లల్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం నగరం భారీగా వరద ప్రవాహాన్ని ఎదుర్కొంటోంది. పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. అనంతపురం నగరంలోని దాదాపు 18 కాలనీలు జలమయం అయ్యాయి. అనంతపురంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు అండగా ఉండాలని అధికారులను సిఎం ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎంఈఓలకు డీఈఓ శామ్యూల్‌ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఉండే ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వాలని సూచించారు. అనంతపురం నగరం, రూరల్‌ ప్రాంతాలలోని పలు కాలనీలు నీట మునిగాయని, దీంతో బుధవారం అర్బన, రూరల్‌ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవులు ప్రకటించారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP Floods, AP News, Heavy Rains

ఉత్తమ కథలు