(G.Venkatesh, News 18, Ananthapur
అనంతపురం జిల్లాలోని పుత్తూరు మండలం కంది కాపుల గ్రామానికి చెందిన బిసాటి భరత్‌కు ఐక్యరాజ్యసమితి యువ పురస్కారం అవార్డు దక్కింది. ఢిల్లీలోనే ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో డిసెంబర్ 5వ తారీఖు అవార్డు అందుకున్నాడు.ఇంతకు ముందు జాతీయ యువజన సహాయ కార్యదర్శి ఒక ప్రకటనలో ఈ అవార్డుకు భరత్ ఎంపికైనట్టు తెలిపారు. ఇంతకుముందే భరత్ వివిధ అవార్డులు గెలుచుకున్నారు.
ఉద్యోగం చేస్తూనే తన వంతు సహాయం అందిస్తున్నారు. ఢిల్లీలో ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ నుంచి ఈ అవార్డు అందుకున్నారు. మారుమూల గ్రామంలో జన్మించిన భరత్ నెహ్రూ యువ కేంద్రం ద్వారా యువతలో సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు, సాఫ్ట్ స్కిల్స్, కెరియర్ గైడ్‌లైన్స్ లో భాగంగా యువత వారి కెరియర్ను ఎలా ముందుకు వెళ్లాలి, ఏ రంగంలో రాణించాలి,వారికి ఏ రంగంలో ఆసక్తి ఉన్నారో అలాంటి రంగాల్లో ఎలా ముందుకెళ్లాలని యువతకు సూచనలు చేశారు.
లైఫ్ స్కిల్స్, సేవ భావం ,రక్తదానంలో భాగంగా అవగాహన కల్పించి, యువతను రక్తదానం చేసేలా వారిలో అవగాహన కల్పించారు.ఎంతోమంది ప్రాణాల కూడా కాపాడవచ్చని రక్తదానాన్ని ప్రోత్సహించారు. వైద్య శిబిరాలు, మహిళా సాధికారతలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి కల్పించేలా వారు సాధికారత పొందేలా ప్రోత్సహించారు. బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగాబాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు ఆ వయసులో చిన్న పిల్లలు ఆలోచనలు, ఎంత నష్టపోతారు తెలియజేసి ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవుల పరిరక్షణ, నేలల పరిరక్షణ, ఓజోన్ పరిరక్షణ మరియు కర్బన ఉద్గారాలు తగ్గింపు లాంటి వాటిలో అవగాహన కల్పించారు. ఆజాదిక అమృత్ మహోత్సవం, డిజిటల్ ఇండియా లో భాగంగా ఇండియాలోనే తయారీ విధానం,ఇండియాని డిజిటల్ ఇండియాగా ఎలా మార్చాలి అని నిర్వహించి యువతలో ప్రోత్సాహం నింపి వివిధ కార్యక్రమాలు కూడా చేపట్టారు.
అంతేకాక కార్యక్రమాలలో అవగాహన కల్పించడం,సదస్సులు నిర్వహించడం ఇలా గైడ్‌లైన్స్ చేస్తూ ప్రోత్సహించేవారు. భరత్‌ను ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఐక్య సమితి గుర్తించి, యువ పురస్కార్ అవార్డును ప్రధానం చేసింది .భరత్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో నెహ్రూ యువజన కేంద్రం అధికారిగా పనిచేస్తున్నారు. మొదటిసారిగా తెలుగు యువకునికి అవార్డు లభించడంతో నగరవాసులో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News