హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్‌తో పాటు జాబ్ గ్యారెంటీ.. ఎక్కడంటే..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్‌తో పాటు జాబ్ గ్యారెంటీ.. ఎక్కడంటే..!

ఉమ్మడి అనంతపురం జిల్లా యువతకు గుడ్ న్యూస్

ఉమ్మడి అనంతపురం జిల్లా యువతకు గుడ్ న్యూస్

అనంతపురం (Anantapuram) మరియు శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) గ్రామీణ నిరుద్యోగ యువతులకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది రూడ్సెట్ సంస్థ.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

అనంతపురం (Anantapuram) మరియు శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) గ్రామీణ నిరుద్యోగ యువతులకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది రూడ్సెట్ సంస్థ. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ యువత లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో శిక్షణ కల్పిస్తూ ఎటువంటి లాభా పేక్ష లేకుండా సంస్థ వారికి శిక్షణలో సహాయం చేస్తుంది. ప్రతి నెల ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని వాటిలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి ఉపాధి కోసం బ్యాంకు ద్వారా ఆర్థిక రుణాన్ని కల్పించే ఈ సంస్థ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఈ సంస్థ శ్రీ ధర్మస్థలం దేవస్థానం మరియు కెనరా బ్యాంక్ వారి సహకారాలతో ఈ సేవా సంస్థలు నడుపుతున్నారు.

యువత నుంచి ఎలాంటి ఫీజులు మరియు ఇతర డబ్బులు వసూలు చేయకుండానే వారికి వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి వారి అభ్యున్నతికి పాటుపడుతోంది. దీనిలో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ నిరుద్యోగ యువతకు ద్విచక్ర వాహనం , విద్యుత్ మోటార్ల మరమ్మత్తులకు సంబంధించి శిక్షణ దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు రోడ్ సేటు సంస్థ డైరెక్టర్ లోక్ నాథ్ రెడ్డి తెలిపారు.

ఇది చదవండి: రాబోయే రోజుల్లో ఈ వ్యాపారానికి ఫుల్ డిమాండ్.. లక్షల్లో లాభాలు

నెలరోజుల పాటు నిర్వహించే శిక్షణకు 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతులు, యువకులు వీటికి అర్హలు. వీటికి అర్హతలు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 22వ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేసి ఆకు తోటపల్లెలో గల రూడ్ సెట్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపారు.

ఈ దరఖాస్తులో ఎంపికైన వారికి ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు వీటిలో ఏమైనా సందేహాలు ఉంటే 9492583484 నెంబర్ సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు