హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganesh Chaturthi 2022: వెరైటీ గణపయ్యను చూసేందుకు క్యూ కట్టిన భక్తులు.. ప్రత్యేకత ఏంటంటే..?

Ganesh Chaturthi 2022: వెరైటీ గణపయ్యను చూసేందుకు క్యూ కట్టిన భక్తులు.. ప్రత్యేకత ఏంటంటే..?

ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకుడు

ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకుడు

Ganesh Chaturthi 2022: దేశ వ్యాప్తంగా గణేష ఉత్సవాల సందడి మొదలైంది. ప్రత్యేకంగా నిలిచిన మండపాలతో పాటు.. ప్రముఖ ఆలయాల్లోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే అనంతపురంలో దర్శనమిస్తున్న ఓ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా ఎలా నిలుస్తున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  Ganesh Chaturthi 2022: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఏపీలో కఠిన ఆంక్షలు ఉన్నా.. వినాయక మండపాలను ఏర్పాటు చేసుకున్నారు భక్తులు.  ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న వినాయకుడి విగ్రహాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో అనంతపురం జిల్లా ఒకటి..  అననంతలో వెరైటీ గణపయ్య... చూసేందుకు ఎగబడుతున్న జనం.  హైందవ సంప్రదాయం ప్రకారం హిందువుల తొలి పండుగ వినాయకచవితి. శ్రీ గణనాధుని పండుగను... కుడుములు., ఉండ్రాళ్లు పిండి వంటలతో ఘనంగా జరుపుకుంటాం.


  వినాయక చదివి అంటేనే.... వాడవాడలా వినాయకుని ప్రతిమలు కొలువు తీరుతాయి. ట్రెండ్ కు తగ్గట్లు స్వామి వారి రూపాలను తాయారు చేస్తారు కళాకారులూ.  ఆయా రాష్ట్రాల్లో సూపర్ హిట్ సినిమాలలో హీరో పాత్ర లాగా బొజ్జగణపతిని రూపొందిస్తారు. బాహుబలి గణపతి., అల్లూరి గణపతి., భీం గణపతి అంటూ వివిధ రకాల గణపతులను మండపాల్లో కొలువుదీరుస్తారు.  ఇక పోటికల్ గణపతి., అసెంబ్లీ మాక్ గణపతి అంటూ పోటికల్ నాయకులూ సైతం తమ అభిరుచులకు అనుగుణంగా వినాయక విగ్రహాలను తాయారు చేసి వారి స్వస్థలంలో., ఉన్న వీధిలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇక పండ్లు., కూరగాయలు., పూలతో చేసిన గణపయ్యలు సర్వసాధారణంగా కనిపిస్తారు. అందరిలా కాకుండా ఓ సాఫ్ట్ వెర్ ఉద్యోగి వినూత్నంగా ఆలోచన చేసాడు.


  ఇదీ చదవండి : భర్తను చీట్ చేసిన సాయి ప్రియ ఎపిసోడ్‌లో మరో బిగ్ ట్విస్ట్.. విశాఖ పోలీసులు ఏం చేశారంటే..?


  అందరూ ప్రతిష్టించిన విధంగా కాకుండా బిన్నంగా తాయారు చేయాలనీ సంకల్పించాడు. కాయిన్స్ తో చేసిన గణపయ్య ఇప్పుడు అందరిని ఆకర్షితున్నాడు.  అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెరైటీగా 5 రూపాయల కాయిన్సుతో తయారు చేసిన వినాయకుడు ఆకర్షణీయంగా నిలిచాడు.. ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి వినాయకున్ని ధర్శించుకుంటున్నారు.


  ఇదీ చదవండి : భర్తను చీట్ చేసిన సాయి ప్రియ ఎపిసోడ్‌లో మరో బిగ్ ట్విస్ట్.. విశాఖ పోలీసులు ఏం చేశారంటే..?


  పామిడి పట్టణంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగచరణ్ పర్యావరణానికి హాని తలపెట్టకుండా తన ప్రతిభను చాటుకుని వినాయక చవతి పండుగకు వైరైటిగా ఏదైనా చేయాలనే ఉద్ధేశంతో 5 రూపాయల కాయిన్సుతో వినాయక విగ్రహాన్ని తయారుచేసి తన ప్రతిభను చాటుకున్నాడు. నాగచరణ్ తయారు చేసిన వినాయకుడు పామిడి పట్టణంలో ఆకర్షణీయంగా కొలువు దీరాడు. ఈసందర్భంగా నాగచరణ్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని తలపెట్టకుండా వినాయకున్ని తయారు చేశానని.ఈ వినాయకున్ని తయారు చేసేందుకు 5 రూపాయల కాయిన్సు 1 రూపాయ కాయిన్లతో తయారు చేశానని.ఈవినాయకున్ని తయారు చేసేందుకు దాదాపు 11 వేల రూపాయలు ఖర్చు చేశామని.అంతేకాకుండా నిమజ్జనం రోజున ఈ కాయిన్లను భక్తులకు పంచుతామని. పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండా ఉండాలనే ఉద్ధేశంతోనే ఈవినాయకున్ని తయారు చేశామని నాగచరణ్ అన్నారు.


  ఇదీ చదవండి : చంద్రుడు ప్రతిష్టించిన గణేషుడు గురించి విన్నారు.. మనసారా కోరుకుంటే మీ సమస్యలు తీరినట్టే..


  నాగచరణ్ ఇంట్లో వినాయక చవితి ముందు రోజే చవితి పండుగ వచ్చేసింది. భోజ్జ గణపయ్య దర్శనానికి భారీ సంఖ్యలో స్థానికులు విచ్చేస్తున్నారు. లక్ష్మి గణపతిని దర్శించుకుంటే సిరులు కలుగుతాయని.... నిమర్జనంఅనంతరం బొజ్జ గణపయ్య రూపంలో ఉన్న కాయిన్స్ ఇవ్వాపని కోరుతున్నారు ప్రజలు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​, Vinayaka chavathi

  ఉత్తమ కథలు