హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lepakshi: లేపాక్షిలో జీ 20 ప్రతినిధుల పర్యటన.. అద్భుత శిల్పకళను చూసి ఆశ్చర్యం

Lepakshi: లేపాక్షిలో జీ 20 ప్రతినిధుల పర్యటన.. అద్భుత శిల్పకళను చూసి ఆశ్చర్యం

లేపాక్షిలో జీ 20 ప్రతినిధులు పర్యటన

లేపాక్షిలో జీ 20 ప్రతినిధులు పర్యటన

Lepakshi: జీ20 ప్రతినిధుల పర్యటన సందర్భంగా లేపాక్షి మండలంలోని దేవస్థానం చుట్టుపక్కల షాపులు, ఇతర దుకాణాలు ముందే పోలీసుల మూసి వేశారు. పకడ్బందీగా వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

శ్రీ సత్య సయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలంలో జీ 20 ప్రతినిధులు పర్యటిస్తున్నారు. ప్రపంచం నుంచి 20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మంగళవారం జీ 20 ప్రతినిధులు ప్రముఖ చారిత్రాత్మక దేవస్థానం, పర్యాటక ప్రదేశమైన, లేపాక్షిలోని ప్రముఖ ప్రదేశాలలో సందర్శించారు. అయితే వీరికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ స్వాగతం పలికారు. తరువాత వీరు లేపాక్షిలోనే కట్టడాలను, ఏకశిలా విగ్రహాలను నంది విగ్రహాలను స్తంభాలను చారిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకున్నారు.

దేవస్థానం నిర్మాణం వాటి ప్రత్యేకతలు వీరికి అధికారులు వివరించారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో వేలాదిస్తంభం గురించి మరియు ఏకశిలా గణేశుడు,నాగలింగం విశిష్టత, శిల్పకళా సంపద గురించి చెప్పారు. ఈ దేవస్థానానికి లేపాక్షి అనే పేరు పురాణాల ప్రకారం వచ్చిందని, రామాయణంలోని సీతను అపహరించే సమయంలో జరిగిన సంఘటనలు వివరించారు.  వాటి చరిత్ర , దేవాలయంలోని చిత్రలేఖనం, రాతి కట్టడాలపై తెలుగు అక్షరాలు, కన్నడ భాషను వారు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం పరిచారు.

లేపాక్షికి వచ్చిన జీ20 ప్రతినిధులు.. వివిధ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగారు. ఇతర విశేషాలు తెలుసుకొని వారు సంతోషం వ్యక్తం చేశారు. జీ20 ప్రతినిధుల పర్యటన సందర్భంగా మంగళవారం లేపాక్షి మండలంలోని దేవస్థానం చుట్టుపక్కల షాపులు, ఇతర దుకాణాలు ముందే పోలీసుల మూసి వేశారు. పకడ్బందీగా వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈ ప్రతినిధులు సందర్శిస్తున్న సందర్భంగా ఇతర పర్యటకులనుఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదు. అంతేగాక స్వయంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పర్యవేక్షించారు. వీటిలో భాగంగా భారీ బలగాలు లేపాక్షి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు కల్పించారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Local News

ఉత్తమ కథలు