హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అనాథాశ్రమం నుంచి హిమాలయాల వరకు.. వాట్ ఏ వండర్‌ఫుల్ స్టోరీ.. కానీ, ఒక్కటే లోటు

అనాథాశ్రమం నుంచి హిమాలయాల వరకు.. వాట్ ఏ వండర్‌ఫుల్ స్టోరీ.. కానీ, ఒక్కటే లోటు

మట్టిలో మాణిక్యం పదానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణ నాయక్.

మట్టిలో మాణిక్యం పదానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణ నాయక్.

కృష్ణా నాయక్ రష్యాలోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించాడు, ప్రభుత్వ సహకారంతో కిలిమంజారో, హిమాలయ పర్వతంలోని తులియన్ పీక్ తదితర శిఖరాలను అధిరోహించాడు. తర్వాత కరాటే లోకి అడుగుపెట్టి బ్లాక్ బెల్ట్ సాధించాడు. 2018 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

(Venkatesh, News18, Anantapur)

చిన్నతనం నుంచే అనాధాశ్రమంలో పెరిగి, తీవ్ర పేదరికం నుంచి ఎన్నో అవార్డులు ప్రశంసలు అందుకున్నాడు పామిడి మండలంలోని పాలెం తండాకు చెందిన చిన్ని కృష్ణ నాయక్, చిన్ని కృష్ణ నాయక్ చిన్నతనంలోనే, తల్లి మరణించడంతో అతడి తండ్రి నారాయణ నాయక్ విజయవాడ లోని ఒక అనాధశ్రయం లో చేర్పించాడు. మూడేళ్లపాటు అక్కడే ఉండి చదువుకున్నాడు, అనంతరం స్వగ్రామానికి చేరుకొని పాఠశాల విద్య పూర్తి చేశాడు. ఇతని కష్టం చూసి తన సోదరుడు సునీల్ కుమార్ నాయక్ తోడ్పాటు తో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో పేజీ వరకు చదివాడు. చిన్నప్పుడు నుంచి క్రీడలపై ఎక్కువ మక్కువ, సాధన తో వాటిపై మరింత పట్టు సాధించాడు.

సోదరుడు చేయూత తో రష్యాలోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించాడు, ప్రభుత్వ సహకారంతో కిలిమంజారో, హిమాలయ పర్వతంలోని తులియన్ పీక్ తదితర శిఖరాలను అధిరోహించాడు. తర్వాత కరాటే లోకి అడుగుపెట్టి బ్లాక్ బెల్ట్ సాధించాడు, బాడీ బిల్డింగ్ లో పుష్కరాలు అందుకున్నారు. వాలీబాల్ క్రీడల్లో జాతీయస్థాయిలో మెరిశాడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు జ్ఞాపకం అందుకున్నాడు .రాష్ట్ర గవర్నర్ విశ్వబ్యూషన్ హరిచంద్ర చేతుల మీదుగా కూడా అవార్డు అందుకున్నాడు.

రచన తదితర రంగాల్లో ప్రతిభ చాటాడు వివిధ రంగాల్లో కలిపి 135 రాష్ట్ర జాతీయ స్థాయి పథకాలు, 80 స్వర్ణ పథకాలు, 35 ట్రోపీలు గెలుచుకున్నారు. ప్రస్తుతం చిన్ని కృష్ణ నాయక్ సేవాగడ్ గిరిజన సంక్షేమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే తన తల్లి మరణించడంతో ఇబ్బందులు పడ్డాడు, ఒక్కడే కష్టాలు పడుతూ పెరిగాడు. 29 ఏళ్ల వయసుకే పలు రికార్డులు సొంతం చేసుకొని పాలెం తాండాకు గుర్తింపు తెచ్చాడు. హై రేంజ్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డు, 2018 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు.

తరలివచ్చిన పురస్కారాలు

ఇక పురస్కారాలకు కొదవలేదు. ఆల్ ఇండియా బంజారా పురస్కారం, విద్యార్థి స్ఫూర్తి రత్న తదితర పురస్కారాలు అందుకున్నాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే దేశం తరఫున ఎవరెస్టు శిఖరం అధిరోహించాలని ఉంది అని దీనికి సుమారు రూ.25 లక్షలు అవసరమవుతుంది, ప్రస్తుతం తక్కువ జీతంతో తాత్కాలిక ఉద్యోగ పని చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాడు చిన్ని కృష్ణ నాయక్.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు