హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ జిల్లాలో ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్.. వారికి మాత్రమే.. వివరాలివే..!

ఆ జిల్లాలో ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్.. వారికి మాత్రమే.. వివరాలివే..!

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు

అనంతపురం (Anantapuram) ప్రభుత్వ హాస్పిటల్ లో క్యాన్సర్ స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంతి తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

అనంతపురం (Anantapuram) ప్రభుత్వ హాస్పిటల్ లో క్యాన్సర్ స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంతి తెలిపారు. చాలామందికి మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.., అలాంటివారికి ఏమైనా ఇబ్బంది ఉంటే గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుంది. కానీ కొద్దిమంది మహిళలకు గర్భాశయానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి 31, ఫిబ్రవరి1 వ తేదీ వరకుఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా మహిళల్లో గర్భానికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే ఇది మామూలుగా సంతానం కలిగిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత గర్భాశయానికి కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అది గర్భశయక్యాన్సర్ కు దారితీస్తుంది. ఈ సమయంలో వారికి తెలియకుండానే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇది చదవండి: ఉత్సావంగా బాలోత్సవ్.. అదరగొట్టిన చిన్నారులు

ప్రభుత్వ హాస్పిటల్ లో 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు మాత్రమే ఈ స్క్రీనింగ్ పరీక్షలకు అర్హులని తెలిపారు. వీరు తెలిపిన తేదీలలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వచ్చి ఓపీనెంబర్ 6లో సంప్రదిస్తే వారికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్ వల్ల ముప్పు లేకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇలా ఎవరైనా మహిళలు వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు