G.Venkatesh, News 18, Ananthapur
అనంతపురం జిల్లా సింగనమల మండలంలో గల కస్తూరిబా విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత కు గురయ్యారు, సుమారు 80 మంది విద్యార్థులు కడుపునొప్పి ,వాంతులు,విరోచనాలతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడ్డారు.తక్షణమే వారిని కస్తూరిబా పాఠశాల అధికారులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 20 మంది పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మిగతా 50 మంది విద్యార్థులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 2నకస్తూరిబా పాఠశాలలో గల హాస్టల్ లో మధ్యాహ్నం సాంబారు మరియు మజ్జిగతో భోజనం తిన్నారు, తర్వాత సాయంత్రం స్నాక్స్ తినడంతో కొద్దిసేపటికి పాఠశాలల్లోనే 80 మంది విద్యార్థులకు వాంతులు ,విరేచనాలు,కడుపునొప్పి,తల తిరగడం లాంటివి జరిగాయి.వెంటనే పాఠశాల ఇన్చార్జ్ హాస్పిటల్కువిద్యార్థులను తరలించారు, అయితే ఎటువంటి సమాచారం పేరెంట్స్ కి అందించకుండా హాస్పిటల్ కి తరలించారు.
హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు చెబుతున్నారు.దాదాపుగా 30 మందిని అనంతపురం ఆస్పత్రికి తరలించిన తర్వాత వారిలో పదిమంది ఆరోగ్యం మెరుగవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 20 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.కొద్ది మందిని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందిస్తున్నారు, అయితే అర్ధరాత్రి మంత్రి జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వ హాస్పిటల్స్ సందర్శించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూపర్డెంట్ని ఆదేశించారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఇలాంటి ప్రాణనష్టము జరగలేదు.
ఇంతకుముందు కస్తూరిబా పాఠశాలలో తమ పిల్లలనుమంచిగా చూసుకున్నరని..ఇలా ఎప్పుడు జరగలేదని ఎటువంటి ఇబ్బంది లేదని ,కానీ ఇది మొదటిసారి ఇలా జరగడం అని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే అది ఎలా ఫుడ్ పాయిజన్ అయిందని కళాశాల నిర్వాహకులు తెలపలేదు, స్నాక్స్ లో ఫుడ్ పాయిజన్ అయిందా,లేదా మధ్యాహ్నం భోజనంలో ఫుడ్ పాయిజన్ అయ్యిందా అని కచ్చితంగా కస్తూరిబా పాఠశాల నిర్వాహకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ఈనిర్లక్ష్యానికి బాధ్యత వహించి పాఠశాల అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి పాఠశాలలో మరియు ప్రభుత్వ హాస్టల్స్ లో మంచి సదుపాయం కల్పించాలని, క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని మంచి ఆహారం అందించాలని అనంతపురం బిజెపి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News