G.Venkatesh, News 18, Ananthapur
అనంతపురం వ్యవసాయ మార్కెట్లో రైతులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రైతు మార్కెట్కు పండ్లు తీసుకు వచ్చిన తర్వాత ఆ రాత్రి సమయంలో పడుకోవడానికి మరియు కూర్చోవడానికి వసతులు లేవని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో అందుబాటులో వచ్చిన మార్కెట్లో రైతులకు సరైన వసతులు లేకపోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అనంతపురంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పండ్లు వ్యవసాయ మార్కెట్కు వస్తూ ఉంటాయి. వీటికిమంచిధర కూడా లభిస్తుంది. నగరంలోనే జ్యూస్ సెంటర్లు మరియు ఇతర వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. మరియు ఇతర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ముంబై, కలకత్తా, ఢిల్లీ , కాన్పూర్, బెనారస్ లాంటి నగరాలు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. వీటికి సరిపడా కంటైనర్లు లారీలో మార్కెట్లో ఇక్కడే ఉంటాయి.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వల్ల అనంతపూర్ మార్కెట్లో చీని పండ్లకు మంచి ధర లభిస్తుంది. బొప్పాయి కూడా మార్కెట్కువస్తూ ఉంటుంది. బొప్పాయి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. బొప్పాయిని కూడా చిరువ్యాపారులు అనంతపురం నగరంలో విక్రయిస్తూ ఉంటారు.
ఇవేకాక దానిమ్మ పండు కూడా అనంతపూర్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా మార్కెట్కు వస్తూ ఉంటుంది. ధర విషయం బాగానే ఉన్నా ఇక్కడకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి ఉంటుంది రాత్రిపూట సరిగా కూడా సదుపాయాలు లేవని వారికి అన్ని విధాల సదుపాయాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News