G.Venkatesh, News 18, Ananthapur
రోజు రోజుకు పతనం అవుతున్న టమోటా ధరలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. అనంతపురం జిల్లా లోని కక్కలపల్లి రోడ్డులో గల టమోటా మార్కెట్లో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీస ధర లేక రైతు లు ఇబ్బంది పడుతున్నారు. ఒక బాక్స్ 80 రూపాయలు కూడా ధర లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ కి తరలించడానికి సగం డబ్బు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. రవాణా ఖర్చు, కమిషన్ మరియు ఇతర ఖర్చులు పోయి కనీసం పెట్టుబడి కూడా రాలేదని తెలుపుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. వ్యవసాయం చేసి కనీసం పెట్టుబడి కూడా రాకుండా పోతే మేము ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని రైతులు తెలుపుతున్నారు. చేతికందిన పంట వర్షం వల్ల మొత్తం నేల రాలి పోయిందని కనీసం మార్కెట్‌కూ కు తీసుకురావడానికి సరిపడా టమోట లేదని చెబుతున్నారు. కనీసం తీసుకువచ్చిన టమోటా కూడా సరిగా గిట్టుబాటు ధర లభించక పోవడంతో వారు చాలా ఆవేదన చెందుతున్నారు.
నాణ్యమైన టమోటా కూడా 150 రూపాయలకు మించి ధర పెరగడం లేదని రైతులు తెలుపుతున్నారు.పొలంలో టమోటా తీయడానికి వచ్చిన కూలీల ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు.మార్కెట్ లో వచ్చే డబ్బు సరిపోవడం లేదని పేర్కొన్నారు,గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News