కియా మోసం చేసింది.. అనంతపురంలో రైతులు, విద్యార్థుల ధర్నా

కియాలో స్థానిక యువతకు మొండి చెయ్యి చూపారని, కేవలం తమిళులకే పెద్ద పీట వేశారని స్థానికులు మండిపడుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నా ఉద్యోగాలు ఇవ్వడంలేదని కియా యాజమాన్యంపై నిప్పులు చెరిగారు.

news18-telugu
Updated: October 14, 2019, 5:15 PM IST
కియా మోసం చేసింది.. అనంతపురంలో రైతులు, విద్యార్థుల ధర్నా
కియా ఆఫీసు ముందు స్థానికుల ధర్నా
news18-telugu
Updated: October 14, 2019, 5:15 PM IST
అనంతపురంలో కియా మోటర్స్‌కు వ్యతిరేకంగా స్థానిక రైతులు, విద్యార్థులు ఆందోళన చేశారు. కియా పరిశ్రమ కోసం తమ భూములను త్యాగం చేశామని.. కానీ తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని స్థానికులు ధర్నా చేపట్టారు. పెనుగొండ మండలం అమ్మవారుపల్లి వద్ద కియా పరిశ్రమ ముందు రహదారిపై బైఠాయించారు. జాతీయ రహదారిపై టైర్లకు నిప్పుపెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, విద్యార్థుల ఆందోళనలతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

కియాలో స్థానిక యువతకు మొండి చెయ్యి చూపారని, కేవలం తమిళులకే పెద్ద పీట వేశారని స్థానికులు మండిపడుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నా ఉద్యోగాలు ఇవ్వడంలేదని కియా యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. కంపెనీ కోసం తాము సర్వస్వం కోల్పోయామని.. కానీ తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం కలగజేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...