Home /News /andhra-pradesh /

ANANTAPURAM EX MINSTER TDP SENIOR LEADER PALLE RAGHUNATH REDDY ACTING IN IQ MOVIE POWERFULL ROLE NGS

Ex Minster Movie: యాక్టర్లుగా మారుతున్న ఏపీ రాజకీయ నేతలు.. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మాజీ మంత్రి ఎంట్రీ.. ఎవరో తెలుసా?

బిగ్ స్క్రీన్ పై మాజీ మంత్రి

బిగ్ స్క్రీన్ పై మాజీ మంత్రి

Ex Minster Movie: డాక్టర్ యాక్టర్ అవ్వడం.. యాక్టర్ పొలిటీషియన్ గా మారడం వెరీ కామన్.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. పొలిటిషియన్స్ యాక్టర్లు అవుతున్నారు. ఇటీవల వెండి తెరపై మెరుస్తున్న.. రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ మాజీ మంత్రి పవర్ ఫుల్ రోల్ లో బిగ్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వనున్నారు. ఇంతకీ ఎవరాయన..? ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా?

ఇంకా చదవండి ...
  Ex Minster Movie: సాధారణంగా చాలామంది డాక్టర్ అవ్వాలనుకిని యాక్టర్ అయ్యాను అంటారు.. అంతేకాదు చాలామంది డాక్టర్లు యాక్టర్లు అయ్యారు కూడా.. అలాగే యాక్టర్లలో చాలామంది పొలిటిషియన్లు కూడా అయ్యారు. అది చాలా కామన్.. కానీ పొలిటీషియన్స్ యాక్టర్ గా మారడం చాలా అరుదనే చెప్పాలి. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనీ కీలక నేతలంతా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు (YCP Leaders) సినిమా తెరపై ఓ మెరుపు మెరిశారు. ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి (Ex Deputy CK Pamula Pushpa Vani) సైతం ఓ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా ప్రస్తుతం ఆడుతోంది కూడా.. తాజాగా మరో మాజీ మంత్రి ఇప్పుడు పవర్ ఫుల్ రోల్ తో స్క్రీన్ ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. అయన చెప్పిన డైలాగ్ లు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి కూడా.. చూడు కమిషనర్ నేను టై వేసుకున్నంత వరకే కలెక్టర్.. టై తీశానంటే టైగర్ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ లో అదరగొట్టారు. ఇలాంటి భారీ డైలాగ్ వింటుంటే బాలయ్య బాబే గుర్తుకు వస్తాడు.. కానీ ఈ డైలాగ్ చెప్పింది మాత్రం తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి...

  సీనియర్ పొలిటీషియన్.. మాజీ మంత్రి.. చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన పల్లె రఘునాథ్ రెడ్డి (Palle Raghunath Reddy) ఇప్పుడు బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ భారీ డైలాగ్స్ ఆయన పేలుస్తున్నారు. ఇంతకీ ఎంతో సీనియర్ అయిన ఆయన సినిమా ఏంట్రీకి కారణం ఏంటంటే.. గతంలో ఆయన ఫ్యాన్స్ హీరోలా ఉన్నావని చెప్పారట.. దీనికి తోడు అనుకోకుండా అవకాశం రావడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారట. లేటు వయసులో ఫేస్‌కు మేకప్‌ వేసుకున్నారు.

  అనంతపురం జిల్లా రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం ఉన్న నేత పల్లె. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన ఆయనలో ఇది మరో కోణమనే చెప్పాలి. విద్యాసంస్థల అధినేతగా ఆయన జిల్లా ప్రజలకు సుపరిచితులే.. అందుకే పల్లె రఘునాథ్‌ రెడ్డిని చాలామంది సార్‌ అని.. మరింత దగ్గరైనవాళ్లు అయ్యవారు అని పిలుస్తారు. ఆయన అందరిలాంటి రాజకీయ నేత కాదు.. సాధారణంగా పొలిటికల్‌ లీడర్లు ఓ స్థాయికొచ్చాక.. వాళ్ల ప్రవర్తనే వేరుగా ఉంటుంది. కానీ.. పల్లెలో అలాంటి యాంగిల్‌ కనిపించదు. కొత్తైనా పాతైనా అందరితో కలిసిపోతారు. నవ్వుతూ మాట్లాడుతుంటారు.  ఇక పబ్లిసిటీలోఅయితే..పల్లె.. రామ్‌గోపాల్ వర్మను గుర్తు తెస్తుంటారని టాక్. మంత్రిగా ఉన్న టైమ్‌లో కూడా పల్లె చేసిన కొన్ని పనులు నవ్వు తెప్పించాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే డ్రస్సింగ్ స్టయిల్‌ , ఇంకొకటి మంత్రిగా ఉన్న సమయంలో బహిరంగంగా షర్ట్ ఫ్యాంట్ తీసి చెరువుల్లో ఈత కొట్టడం, కూలీలా పని చేయడం ఇలా చెబుతూ పోతే పల్లె వేషాలు చాలానే ఉంటాయి.

  ఇదీ చదవండి : పిన్నిని చంపిందెవరు అంటూ వైసీపీ ప్రశ్నల వర్షం.. మీదే రక్త చరిత్ర అంటూ లోకేష్ కౌంటర్.. వాస్తవం ఏంటి..?

  ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన కూరగాయల లక్ష్మీపతి అనే నిర్మాత.. ఐక్యూ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమా ఇది. పల్లె సార్‌కు చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా. సినిమా కోసం కాలేజీలు అడిగారు దర్శక నిర్మాతలు. అలాగే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర ఉందని.. దానికి మీరు సూట్ అవుతారని చెప్పగా..పల్లె రెడీ అని వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో పల్లె రఘునాథరెడ్డి జిల్లా కలెక్టర్‌గా పవర్‌ ఫుల్‌ రోల్‌ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి సీన్లు కూడా పూర్తయ్యాయి.

  ఇదీ చదవండి : జగన్ సర్కార్ వైఫల్యమే కారణం.. కోనసీమ ఘటనపై స్పందించిన చంద్రబాబు

  ఈ సినిమాలో పల్లె చెప్పిన తొలి డైలాగర్ చాలా పవర్ ఫుల్ అయ్యింది. చూడు కమిషనర్ నేను టై కట్టుకున్నంత వరకే కలెక్టర్.. టై తీస్తే టైగర్ అని.. ఈ సినిమాలో కమిషనర్ గా సుమన్‌ సహా.. పలువురు ప్రముఖ నటీనటులు ఉన్నారట. గతంలో పల్లె ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అమెరికా వెళ్లారు. అక్కడి తెలుగువారు..మీరు హీరోలా ఉన్నారు సార్‌..సినిమాల్లో ఎందుకు నటించకూడదని అన్నారట. అందుకేనేమో ఇలా సినిమా ఎంట్రీ ఇస్తున్నారు. ఆ ముక్క సారు బుర్రలో బాగా పాతుకుపోయింది. ఇంతకాలానికి అనుకోకుండా అలాంటి అవకాశం రావడంతో..రెండో మాట లేకుండా ఒప్పుకున్నారు. మరి ఇప్పటికే విద్యావేత్తగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన పల్లె ఇప్పుడు నటుడిగా కూడా కనిపించబోతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Movie, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు