(G.Venkatesh, News 18, Ananthapur)
అనంతపురం పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలుపడి చాలా అధ్వానంగా తయారయ్యాయి. నగరవాసులు బయటకు వెళ్లాలన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలపై వెళ్లేటప్పుడు రోడ్లు గుంతల గుంతలు ఉండడంతో విసుగెత్తి పోతున్నారు నగరవాసులు. కనీసం గుంతలు పూడ్చాలన్న ఆలోచన కూడా చేయట్లేదు అధికారులు.ఎక్కడ చూసినా గుంతలు పడటం రోడ్డుపై వెళ్లే వారు గుంతలను చూసుకొని వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గుంతలతో వాహనాలు పాడవడమే కాక నడిపే వారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కనీసం చిన్నచిన్న గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి వేణుగోపాల్ నగర్ కి వెళ్లే ఎన్టీఆర్ మార్గం రోడ్లో రాయాల్కో ఎదురుగా రోడ్డుకి పెద్ద రంధ్రమే పడింది. ఈ మార్గంలో చిన్న మురికి కాలువ రోడ్డు కింద వైపు నుంచి వెళుతుంది.
దీనికోసం బ్రిడ్జిని ఏర్పాటు చేశారు, అయితే ఆ బ్రిడ్జికి రంద్రం పడిన పూడ్చలేని స్థితిలో అధికారులు ఉన్నారు. కచ్చితంగా ఆ బ్రిడ్జ్ వద్దనే రోడ్డు కూడా వెడల్పు తక్కువగా ఉంది.అలాంటి సమయంలో రంధ్రం పక్కగుండా వెళుతున్నప్పటికీ వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో అయితే ఆ రంద్రం కూడా సరిగా కనిపించదు.
దీనితో వాహనదారులు కింద పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటుగా వెళ్లే ఆటో గాని, ద్విచక్ర వాహనాలు కానీ, నడుచుకొని వెళ్లేవారు కానీ, జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కిందకి పడిపోవడం జరుగుతుంది. నిత్యం ఆ రోడ్డు వెంబడి కొన్ని వందల వాహనాలు వెళ్తుంటాయి.దీనితో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారులు. రాత్రి సమయాల్లో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు.
అయితే వీలైనంత తొందరగా మరమ్మతులు చేపట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను నగరవాసులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News