G Venkatesh, News18, Anantapuram
అనంతపురం (Andhra Pradesh) నగరంలో ఉచితంగా ఆహారం అందిస్తున్న ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్. ఇక్కడ ఆహారం ఉచితంగా తినవచ్చు, రోజుకు ఎంతోమంది నిరుపేదలు ఆహారం లేక పస్తులు పడుకోవలసిన పరిస్థితుల్లో ఉంటారు. అంతేకాక దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా వారికి ఆహారం దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అనంతపురం పట్టణంలోనే శుభాష్ రోడ్ లో గల అనంతపురం క్లబ్ వద్ద ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం నగరంలో ఉన్న సుంకర వరదరాజులు భార్య సుంకర విజయ్ కుమారి వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ఫ్రిడ్జ్ లో ఎవరైనా వెళ్ల ఉచితంగా భోజనం తినవచ్చు, ఇందులో ఎవరైనా ఆహారం ఉంచవచ్చు.కావాల్సిన వారు ఆహారాన్ని ఇక్కడే తినవచ్చు. పల్లెం కూడా అక్కడే ఉంచి ఉంటారు.అంతేకాక ఏదైనా వేడి వస్తువులు ఉంచడం కోసం ఓవెన్ కూడా అందుబాటులో ఉంచారు. నిజంగా ఎంతో మందికి ఆకలి తీరుస్తోంది. ఈ ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్.
అనంతపురం నగరంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని వందల కొద్ది హాస్టల్స్ కూడా నిర్వహిస్తున్నారు.అంతేకాక కొన్ని వందల కొద్ది హోటల్ కూడా నడుపుతున్నారు. అయితే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకచోట ఆహారం వేస్ట్ అవుతూ ఉంటుంది. వారు బయట పడేయాల్సిన పరిస్థితి వస్తా ఉంటుంది. అయితే అలా మిగిలిన వారు ఈ ఫ్రిజ్లో ఆహారాన్ని ఉంచవచ్చు,
ఇలా వేస్ట్ కాకుండా ఆహారాన్ని ఈ ఫ్రిడ్జ్ వద్ద ఉంచుతారు. అయితే ఇక్కడ అవసరమైన వారు ఆకలితో ఆహారం అందరివారికి ఇక్కడ ఉచితంగా ఆహారం తినవచ్చు. ఎంతోమంది ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోతే ఇతర పరిస్థితిల వల్ల ఆహారం తినలేక పోతున్నారు, అలాంటివారికి ఇక్కడ ఎటువంటి ఆహారం తినవచ్చు నిజంగా ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News