G.Venkatesh, News 18, Ananthapur
ఓ ప్రాంతానికి ఓ వంటకం ప్రత్యేకం.. ఏ వంటకమైనా భుజించాల్సిందే. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకం ఇష్టం ఉంటుంది. కొంతమందికి హాట్ స్వీట్ కాంబినేషన్, మరికొంతమందికి ఓన్లీ హట్, ఇంకొందకి హట్ మాత్రమే నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ (Chinese Fast Food) పై పడిపోతున్నారు జనాలు. గోబీ, గోబీ న్యూడీల్స్, ఎగ్ న్యూడీల్స్, గోబీ మంచురీయా ఇలా.. చాలా చాలా రకాలున్నాయి. ఇలా ఎన్ని ఉన్నా బిసి బిళ్లా బాత్ ముందు ఇవన్నీ తక్కువే అనవచ్చు... ఏంటీ బసి బిళ్లా బాతా.. అవును బిసి బెళా బాత్ (Bisi Billabath)... కానీ మీరు అనుకున్నంటు ఇదేమీ బాతు కాదు.. ఇదీ ఓ ప్రత్యేకమైన వంటకం. దీనిని తినటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. షుగర్, బీపీ పేషంట్లు కూడా ఎంచక్క ఎంజాయ్ చేస్తూ తినచ్చు.. అసలు ఈ వంటకం ఎక్కడ దొరుకుతుంది, దీని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం పదండి..!
బిసి బిళ్లాబాత్ చాలా స్పెషల్
అనంతపురం (Anantapuram) నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్ర హాస్పిటల్ సర్కిల్లో గల ఇడ్లే ఇన్ మోర్ ప్యూర్ వెజిటబుల్ హోటల్లో చాలా టేస్టీగా ఉంటుంది. దీనితో పాటు వివిధ రకాల టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిసి బెళా బాత్ గురించి, బిసిబిళ్లాబాత్ కర్ణాటక (Karnataka) ప్రముఖమైన టిఫిన్.
ఇది కర్ణాటక రాష్ట్ర సరిహద్దు అయిన అనంతపురం జిల్లా (Anantapur District) వాసులకు పరిచయం అయిన వంటకం. అనంతపురంలో కూడా చాలా పాపులర్ అయిన అల్పాహారం బిస బెళా బాత్. ఇది తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలా మంచిదని గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఉన్న వారు మరియు షుగర్ ఉన్న వారకిఎలాంటి సమస్య ఉండదని తెలిపారు.
ఇడ్లీ ఇన్ మోర్ చుట్టుపక్కల గల హాస్పిటల్స్ లో రోగుల ఆరోగ్యం కోసం ఎక్కువగా ఇష్టపడతారని డాక్టర్స్ కూడా వీటిని తినమని చెప్తాను అని నిర్వాహకులు తెలిపారు.అన్ని రకాల వెజిటేబుల్స్ టమోటా, ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, బఠాణీ మరియు వివిధ రకాల వెజిటెబుల్స్ మొత్తం నూనెలో డ్రైగా చేసి తర్వాత బియ్యం ఒక అర్ధగంట నీటిలో నానబెట్టి బిసి బెళా బాత్ పేస్ట్ కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి కుక్ చేస్తారు. తయారయిన తరువాత వాటికి చట్నీ మరియు పెరుగు పచ్చడి కల్పిస్తారు. ముఖ్యంగా బూంది మిక్చర్ కలిపి ఇచ్చిన తర్వాత ఆ బిసి బెళా బాత్ అద్భుతంగా ఉంటుంది. హోటల్ నిర్వాహకులు నాణ్యమైన టిఫిన్ ఆరోగ్యకరమైన టిఫిన్ అందిస్తామని తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News