(G.Venkatesh, News 18, Ananthapur)
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే వేరుశనగ పంటకు మారు పేరుల నిలుస్తూ వస్తోంది. అనంతపురంలో ఎక్కువగా రాష్ట్రంలోనే వేరుశనగ పంటను ఎక్కువగా పండిస్తారు, ప్రతి సంవత్సరం వేల ఎకరాలలో వేరుశనగను పంటను సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయానికి అనుకూలమైన భూమి తక్కువగానే ఉంది. కొన్నిచోట్ల కరువుతో ఉంటుంది, మరియు నీరు ఎక్కువగా లభ్యమయ్యే చోట వరి పంటను పండిస్తూ ఉంటారు, అంతేకాక మొక్కజొన్న, సన్ఫ్లవర్ మరియు కూరగాయలు పంటలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే వర్షాధార పంటలు తక్కువగా పండిస్తూ ఉంటారు.
వేరుశనగ కూడా వర్షాధార పంట అయినప్పటికీ కూడా, వర్షం కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా తట్టుకొని నిలబడే పంట కాబట్టి వాటిని ఎక్కువగా అనంతపూర్ జిల్లాలో ప్రతి సంవత్సరం పంట వేస్తూ ఉంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా వర్షం మీద ఆధారపడి ఈ పంటను వేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాలలో పంట నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు వేరుశనగ పంట రైతులు.
అయితే ఈ సంవత్సరం ఉమ్మడి అనంతపురం జిల్లాకు వ్యవసాయ, ఏపీ సీడ్స్ 1.78 లక్షల క్వింటాల వేరుశనగ విత్తనాలు పంపిణీ కేటాయించింది. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లాకు లక్ష కింటాలు, మరియు అనంతపురం జిల్లాకు 78 వేలు క్వింటాల వేరుసెనగ విత్తనాల కేటాయించారు. మే 15వ తారీకు నుంచి గ్రామ సచివాలయంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్బికే ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంకా అవసరమైతే ఆయా జిల్లాల అవసరాన్ని బట్టి రెండో విడతలో కూడా వేరుసెనగ విత్తన పంపిణీ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News