హోమ్ /వార్తలు /andhra-pradesh /

రష్యాకి కొత్త తలనొప్పి.. పశ్చిమ దేశాలతో మరో వివాదం

రష్యాకి కొత్త తలనొప్పి.. పశ్చిమ దేశాలతో మరో వివాదం

 లిథువేనియా శత్రు చర్యలకు తప్పక బదులిస్తామన్న రష్యా.

లిథువేనియా శత్రు చర్యలకు తప్పక బదులిస్తామన్న రష్యా.

GFX Script

రష్యా, పశ్చిమ దేశాల మధ్య మరో కొత్త వివాదం మొదలైంది. Russia ఉత్పత్తులను తమ భూభాగం నుంచి తరలించకూడదనే EU ఆంక్షలను లిథువేనియా అమలు చేస్తోంది. అయితే.. ఈ నిషేధాన్ని రష్యా దిగ్బంధంగా పేర్కొనడమే కాకుండా, లిథువేనియా శత్రు చర్యలకు తప్పక బదులిస్తామని హెచ్చరించింది. ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నా.. లిథువేనియా ఇలా చేయడంపై రష్యా ఆగ్రహంతో ఉంది. Western Countries మౌఖిక ప్రకటనలను మాత్రమే కాకుండా, రాతపూర్వక హామీలను కూడా నమ్మకూడదని రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పత్రేషేవ్ అన్నారు.

ఇలాంటి శత్రు చర్యలపై రష్యా కచ్చితంగా స్పందిస్తుందని.. పరిణామాలు లిథువేనియా జనాభాపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నికోలాయ్ హెచ్చరించారు. అయితే నిషేధాన్ని లిథువేనియా సమర్థించుకుంది. కేవలం ఈయూ ఆంక్షలకు అనుగుణంగా తీసుకున్న చర్యలని లిథువేనియా వ్యాఖ్యలు చేసింది. లిథువేనియా ద్వారా కలినిన్‌గ్రాడ్ ప్రాంతానికి, బయటికి ప్రయాణాలు, అనుమతి లేని వస్తువుల రవాణా నిరంతరాయంగా కొనసాగుతాయని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్, నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, లిథువేనియాను సపోర్ట్ చేస్తున్నామని యూకే పునరుద్ఘాటన చేసింది.

ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేస్తున్న యుద్ధం గురించి చాలా స్పష్టంగా ఉన్నామని స్టేట్ డిపార్ట్‌మెంట్‌ స్పోక్స్‌పర్సన్‌ నెడ్‌ ప్రైస్‌ తెలిపారు. NATO ఆర్టికల్ 5ను నమ్ముతున్నామని, నాటోలోని ఒక్క దేశంపై దాడి జరిగితే అన్ని సభ్య దేశాలపై జరిగినట్లు భావిస్తామని, దీనికి సంబంధించి యూఎస్‌ దృఢంగా ఉందని నెడ్‌ ప్రైస్‌ చెప్పారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యన్ ఎక్స్‌క్లేవ్ కాలినిన్‌గ్రాడ్‌ను త్వరలో యుద్ధంలోకి లాగుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

నిషేధంపై పుతిన్‌కు ఆగ్రహం ఎందుకు ?

రష్యా ప్రధాన భూభాగం నుంచి కాలినిన్‌గ్రాడ్ ఎక్స్‌క్లేవ్‌ను లిథువేనియా రవాణా నిషేధం పూర్తిగా విభజిస్తోంది. కాలినిన్‌గ్రాడ్ ఎక్స్‌క్లేవ్, రష్యా ప్రధాన భూభాగాల మధ్య ఉన్న ఏకైక లింక్ నిషేధిత రైలు రవాణా మార్గమే.. రష్యా నుంచి వస్తువుల దిగుమతులపై ఎక్కువగా కాలినిన్‌గ్రాడ్ ఆధారపడింది. లిథువేనియా నిషేధంతో భూభాగంలోకి వచ్చే అన్ని వస్తువులలో సగానికిపైగా ఆగిపోతాయని కాలినిన్‌గ్రాడ్ గవర్నర్ పేర్కొన్నారు. బొగ్గు, లోహాలు, నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాలు మొదలైన ఎగుమతులపై వీటి ప్రభావం పడనుంది. రష్యా ప్రధాన భూభాగం నుంచి కాలినిన్‌గ్రాడ్‌కు ఉన్న ఏకైక చమురు పైప్‌లైన్‌పై కూడా నిషేధం విధించారు.

కాలినిన్‌గ్రాడ్, సువాల్కీ కారిడార్ ఎక్కడ ఉంది?

బాల్టిక్ సముద్రంలోని కాలినిన్‌గ్రాడ్ ఎక్స్‌క్లేవ్ రష్యాలో నాటో సభ్యుడైన లిథువేనియా, పోలాండ్ మధ్య ఉన్న ఏకైక భాగం. ఏప్రిల్ 1945లో నాజీ జర్మనీ నుంచి కాలినిన్‌గ్రాడ్‌ను సోవియట్ దళాలు స్వాధీనం చేసుకుంది. పోట్స్‌డామ్ ఒప్పందంతో సోవియట్‌ భూభాగంలోకి కాలినిన్‌గ్రాడ్‌ చేరింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు కూడా రష్యన్ ఫెడరేషన్‌లో భాగంగానే కాలినిన్‌గ్రాడ్‌ ఉంది. బెలారస్ నుంచి వేరు చేసి పోలిష్, లిథువేనియన్ భూభాగాలను కాలినిన్‌గ్రాడ్‌కు దక్షిణాన ఉన్న ఒక సన్నని స్ట్రిప్ కలుపుతుంది. సువాల్కీ కారిడార్ అని పిలిచే ఈ భూమి మాత్రమే, బాల్టిక్ రాష్ట్రాలు, ఈయూలోని మిగిలిన ప్రాంతాల మధ్య ఉన్న ఏకైక ఓవర్‌ల్యాండ్ లింక్.

కాలినిన్‌గ్రాడ్‌ ఎందుకు ప్రధానం?

రష్యన్ ఎక్స్‌క్లేవ్ బాల్టిక్ తీరంలో ఒంటరిగా ఉన్న కాలినిన్‌గ్రాడ్, వ్యూహాత్మకంగా ముఖ్యమైన భూభాగం. బాల్టిక్ సముద్రంలో ఏడాది పొడవునా మంచు రహితంగా ఉండే ఏకైక రష్యన్ నౌకాశ్రయం కాలినిన్‌గ్రాడ్.. దీంతో స్కాండినేవియాను చుట్టిరావాల్సిన అవసరం లేకుండా ఆర్కిటిక్ మహాసముద్రంలోకి రష్యా నౌకలు చేరగలవు. రష్యా బాల్టిక్ నౌకాదళానికి ఒక ముఖ్యమైన ప్రయోగ స్థానం కాలినిన్‌గ్రాడ్.. నౌకాదళ అవసరాలకు మాత్రమే కాదని, ఆ భూభాగంలో రష్యా అణ్వాయుధాలను ఉంచిందని సమాచారం. 2018లో ఈ ప్రాంతంలో అణ్వాయుధ నిల్వ బంకర్‌ను రష్యా ఆధునీకరించినట్లు యూఎప్‌ శాస్త్రవేత్తలు ఆర్థారించారు. స్వీడన్, ఫిన్లాండ్ NATO సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత మాస్కోకు ఈ ప్రాంతం మరింత ముఖ్యమైంది. నాటోలో నార్డిక్ దేశాలు చేరడం వల్ల బాల్టిక్స్ అణు రహిత స్థితి గురించి ఇకపై చర్చలు ఉండవని క్రెమ్లిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత యుద్ధంలో NATO జోక్యం చేసుకుంటే, ఐరోపాపై రష్యా దాడికి కాలినిన్‌గ్రాడ్ లాంచింగ్ ప్యాడ్ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

సువాల్కీ కారిడార్‌లో రష్యా-నాటో ఘర్షణ?

నాటోకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటే సువాల్కీ కారిడార్ రష్యా మొదటి లక్ష్యం కావచ్చని నిపుణులు అంటున్నారు. NATOకు కీలకమైన సువాల్కీ కారిడార్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటే, నాటో, బాల్టిక్ రాష్ట్రాలకు మార్గం తెగిపోనుంది. పుతిన్ నేరుగా నాటోతో ఘర్షణ పడాలని నిర్ణయించుకుంటే ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా కారిడార్ మారుతుందని పశ్చిమ సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కో ఇప్పుడు కాలినిన్‌గ్రాడ్‌కు ల్యాండ్ కారిడార్‌ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చని, ఇది పశ్చిమ దేశాలతో పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. లిథువేనియా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుందని రష్యా హెచ్చరిస్తోంది.

NATO సభ్య దేశమైన లిథువేనియాపై రష్యా చేసే ఏదైనా ప్రత్యక్ష సైనిక చర్య ఒప్పందంలోని ఆర్టికల్ 5ను ప్రేరేపిస్తుందని.. దాడులతో ఆర్టికల్ 5 మొత్తం 30 మంది సభ్యుల నాటో కూటమిని రష్యాతో యుద్ధంలోకి తీసుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చిలో లిథువేనియాలో తన ఉనికిని పెంచుకున్న యూఎస్‌, దేశంలో సుమారు 1,000 మంది సైనికులను మోహరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి, దేశంలో సైన్యాన్ని విస్తరించాలని NATOని లిథువేనియా కోరింది. మరి ఈ విపరీత పరిస్థితులు ఎటు వైపునకు దారితీస్తాయో చూడాలి.

First published:

Tags: International, Nato, Russia, Ukraine

ఉత్తమ కథలు