హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఎస్కేయూలో లా లేనట్టేనా..?

Andhra Pradesh: ఎస్కేయూలో లా లేనట్టేనా..?

లా కోర్సు

లా కోర్సు

Andhra Pradesh: అనంతపురం నగరంలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ లో న్యాయ శాస్త్రాన్ని తొలగిస్తున్నారు.అయితే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

G.Venkatesh, News 18, Ananthapur

అనంతపురం నగరంలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ లో న్యాయ శాస్త్రాన్ని తొలగిస్తున్నారు.అయితే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అంతేకాక సరియైన న్యాయ శాస్త్రాన్ని బోధించే ఇతర యూనివర్సిటీలు కానీకాలేజీలు కానీ అందుబాటులో లేవు. ఆసక్తికర విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాల్సి వస్తే విశాఖపట్నం యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో చదవాల్సి ఉంటుంది.

అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా విద్యార్థులకు న్యాయ శాస్త్రాన్ని బోధించే సరియైన విద్యాసంస్థలుఅందుబాటులో లేవు. ఎంతోమంది అనంతపురం మరియు సత్యసాయి జిల్లా విద్యార్థులకు దగ్గర్లో మరియు అందుబాటులో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని అభ్యర్థి అభ్యసించే అవకాశం అందుబాటులో ఉండేది. ప్రతి సంవత్సరం ఎల్.ఎల్.బి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత, ఈ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించేవారు ఎంతోమందికి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాలని లాయర్లు అవ్వాలని కలలుగానే మిగిలిపోతుంది. వారికి ఇదొక విచారించదగ్గ సంఘటన.

న్యాయ శాస్త్రాన్ని అభ్యసించే అభ్యర్థులకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో సీటు వచ్చిన తర్వాత వారికి ఉచిత హాస్టల్ సదుపాయం కూడా ఉండేది. అలా వారు పేద పిల్లలు, ఆర్థిక స్తోమత లేని వారు ఇక్కడ చదువుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉండేది. అంతేకాక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించడానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి వచ్చేవారు, కానీ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రం తొలగింపుతో వీరికి చాలా ఇబ్బందిగా మారింది.

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని కొనసాగించాలని ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, మరి అంతేకాక అనంతపురంలోని నాయకులు, ప్రతిపక్షా నాయకులు న్యాయ శాస్త్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక తొలగిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. నిజంగా తొలగిస్తే మాత్రం ఎంతోమంది విద్యార్థులు ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది.శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

ఈ యూనివర్సిటీలో చదివినవారు ఎంతోమంది ఉన్నతమైన లాయర్లగా వారి జీవితాలను కొనసాగించారు, వారు ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలిచారు. అలాంటిది ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రం తొలగింపు ఎంతో అన్యాయమని విద్యార్థులు తెలుపుతున్నారు. నిజంగా న్యాయ శాస్త్రం కొనసాగింపు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కొనసాగించాలని విద్యార్థులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు, మరి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎస్కే యూనివర్సిటీలో న్యాయ శాస్త్రం కొనసాగిస్తే ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు