G.Venkatesh, News 18, Ananthapur
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలో గల గంధం ధీరజ్ కేవలం 11 సంవత్సరాలలోనే యాప్ డెవలప్ చేశాడు.ధీరజ్ ప్రస్తుతం గోరంట్ల మండలంలోని ఉదయ్ కిరణ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమాలు జరుగుతున్న వేళ, వివిధ ప్రాంతాల ప్రసార మాధ్యమాల ద్వారా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ దేశభక్తి చాటుకున్నారు, దీన్ని గమనించిన ధీరజ్ తన తల్లిదండ్రుల సహకారంతో జాతీయ జెండాలను సేకరించి, వాటి రోడ్డు పక్కన అమ్మి అలా వచ్చిన నగదు తన వద్ద దాచుకున్న బ్యాంకులోని మిగతా మొత్తాన్ని జమ చేసి, పదివేల రూపాయలను కేంద్రీయ సైనిక్ బోర్డు కు బదిలీ చేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
అందరిలాగే సాధారణ విద్యార్థులు ఉండే ధీరజ్ మూడవ తరగతి వరకు క్రమం తప్పకుండా స్కూల్‌కి వెళ్లేవాడు, కరోనా సమయంలో లాక్ డౌన్ రావడంతో ఇంటికి పరిమితం కావడంతో కంప్యూటర్లు అందుబాటులో ఉండటంతో అత్యంత చిన్న వయసులోనే కంప్యూటర్ పరిజ్ఞానం బాగా పెంచుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాడు, ఆ అబ్బాయి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆన్లైన్ నందు కోడింగ్ కోర్స్ ను సంబంధించి కోచింగ్ ఇప్పించడంతో ఏకంగా ఇప్పటివరకు మూడు యాప్ లు రూపొందించాడు.
మొదటి యాప్ రియల్ ఎస్టేట్ రంగంలో నిమగ్నమైన వ్యక్తుల అవసరాలు తీర్చడానికి, రియల్ ఎస్టేట్ క్యాలిక్యులేటర్ అనే యాప్ చేసి రియల్ ఎస్టేట్ వారికి ఉపయోగపడేలా తయారు చేశాడు. రెండవ యాప్ ను ఆజాద్ క అమృత్ మహోత్సవం కార్యక్రమం లో భాగంగా మై టౌన్ గోరంట్ల తయారు చేశారు, ఈ యాప్ ద్వారా కొత్త వ్యక్తులు, స్థానిక వ్యక్తులు వారికి అవసరమైన దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, విగ్రహాలు, సంస్థలు ఇలా మొదలగునవి ఈజీగా గుర్తించవచ్చు.
ఇక మూడవ యాప్ పేరు UKEM school దీని ద్వారా విద్యార్థుల్లో పాఠశాలలకు తీసుకెళ్లే బ్యాగుల బరువును తగ్గించే లక్ష్యంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. తన తోటి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గమనించి, రెండు నెలలపాటు శ్రమించి ఏకంగా 12300 బ్లాక్ వాడి ఈ యాప్ తయారు చేశాడు.
ఈ యాప్ నందు సూచించిన విషయాలను స్కూల్ యజమాన్యాలు ఆచరణలో పెడితే, నిస్సందేహంగా విద్యార్థుల బ్యాగ్ బరువులు దాదాపు 50 శాతం తగ్గుతుంది. విద్యార్థుల రోజువారీ హోంవర్క్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ యాప్ ఉపయోగించి చూడవచ్చు. అయితే అతి చిన్న వయసులోనే ధీరజ్ యాప్ డౌన్లోడ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News