హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapuram: ఏ తల్లికీ ఈ కష్టం రాకూడదు.. కన్నకూతురే అలా చేస్తే.. ఎలా తట్టుకుంటుంది పాపం..!

Anantapuram: ఏ తల్లికీ ఈ కష్టం రాకూడదు.. కన్నకూతురే అలా చేస్తే.. ఎలా తట్టుకుంటుంది పాపం..!

బాధితురాలు షేక్ నన్నిబీ

బాధితురాలు షేక్ నన్నిబీ

Anantapuram: తల్లిని మించిన ప్రత్యక్ష దైవం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు అని. కానీ ఓ కూతురి మనస్సు కర్కశంగా మారింది. నవమోసాలు కనిపించిన తల్లిని దారుణంగా మోసం చేసింది. వృద్ధాప్యంలో తల్లిని చేదోడువాదోడుగా ఉండాల్సిందిపోయి ఆమెనే వంచించింది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

పుట్టిన తర్వాత తొలిసారి పలికే పదం అమ్మ. ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు ఎదురైనా తన రెక్కల కష్టంతో పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది తల్లి. కన్నబిడ్డ కంట్లో నీలాలు కారితే... తల్లి కళ్ళు చెమ్మగిల్లుతాయి. అంత అపురూపమైన బంధం మాతృమూర్తిది. అందుకే అంటారు తల్లిని మించిన ప్రత్యక్ష దైవం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు అని. కానీ ఓ కూతురి మనస్సు కర్కశంగా మారింది. నవమోసాలు కనిపించిన తల్లిని దారుణంగా మోసం చేసింది. వృద్ధాప్యంలో తల్లిని చేదోడువాదోడుగా ఉండాల్సిందిపోయి ఆమెనే వంచించింది. తల్లి రిటైర్మెంట్ డబ్బులను కాజేసి ముఖం చాటేసింది. కూతురితో పోట్లాడలేక ఆ తల్లి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.., అనంతపురం నగరంలోని మున్నా నగర్ కు చెందిన షేక్ నన్నిబీ, షేక్ రజాక్ సాహెబ్ నాలుగు దశాబ్దాల కాలం నుంచి నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులుఉన్నారు. షేక్ రజాక్ సాహెబ్ దివ్యాంగుడు కావడంతో నన్నిబీ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేది. వృత్తి రీత్యా నన్నిబీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కబేళాల్లో స్వీపర్ గా విధులు నిర్వహిస్తూ... పిల్లలను పెంచి పెద్ద చేసి... పెళ్లిళ్లు చేసింది. కొంతకాలం క్రితం ఆమె రిటైర్మెంట్ కావడంతో కొన్నాళ్ల క్రితం బెనిఫిట్స్ అంతా ఆమె అకౌంట్ లో డిపాజిట్ అయ్యింది.

ఇది చదవండి: పిల్లలే కాడెద్దులు.. దుక్కి దున్నితేనే కడుపు నిండేది.. ఓ రైతు దీనగాధ



మొత్తం రూ.21 లక్షలు ఆమె ఖాతాలో అయ్యాయి. చివరి దశలో తనకు తన భర్తకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ డబ్బులు సహాయంగా ఉంటుందని భావించింది. తల్లి వద్ద ఇంత డబ్బులు చూసిన కూతురి కళ్లుకుట్టాయి. తల్లి వద్ద డబ్బులు కాజేయాలని కన్నింగ్ ప్లాన్ వేసింది. తమ్ముడి ఇంటి వద్ద ఉన్న తల్లిని ప్రేమగా ఇంటికి తీసుకెళ్లింది. ఆమెకు షుగర్ మాత్రలకు బదులు రోజూ నిద్రమాత్రలు ఇచ్చి మగతగా ఉన్నప్పుడు బ్యాంకుకు తీసుకెళ్లి మొత్తం రిటైర్మెంట్ సొమ్మును తన ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. నీ దగ్గర ఉంటే ఎవరైనా మోసం చేస్తారని అందుకే తన ఖాతాలో వేయించుకున్నట్లు కూతురు చెప్పడంతో ఆ పిచ్చితల్లి నమ్మింది.

కొన్నాళ్ల తర్వాత తన డబ్బులివ్వమని అడగ్గా.. మొత్తం నీకే ఖర్చు చేశా.. నా దగ్గరేమీ లేదంటూ మొహం చాటేసింది. తన డబ్బు తిరిగిచ్చేయాలని కూతురు కాళ్లా వేళ్లా పడినా ఆ కఠిన హృదయం స్పందించలేదు. దీంతో చేసేదిలేక తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. తన భర్త దివ్యాంగుడని.. ఏళ్ల తరబడి రెక్కల కష్టం చేస్తే వచ్చిన డబ్బును కూతురు కాజేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఐతే పోలీసులు స్పందించకపోవడంతో అనంతపురం ఫీకరప్పను కలిసి ఫిర్యాదు చేసింది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh

ఉత్తమ కథలు