Home /News /andhra-pradesh /

ANANTAPURAM CYBER CRIME GANG CHEATED ANGANWADI WORKER ON THE NAME OF COVID 19 INSURACNE IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Anantapuram: కొవిడ్ ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్ వచ్చిందా..? అయితే మీ ఎకౌంట్ చెక్ చేసుకోండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సైబర్ మోసాలు (Cyber Crime) రోజు రోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. అమాయక ప్రజలని మోసం చేసేందుకు నూతన పధకాలు రచిస్తున్నారు. సమయానుగుణంగా మాటలు చెప్పి బ్యాంకు ఖాతాలో నగదును మొత్తం కాజేస్తున్నారు.



    GT Hemanth Kumar, News18, Tirupati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సైబర్ మోసాలు (Cyber Crime) రోజు రోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. అమాయక ప్రజలని మోసం చేసేందుకు నూతన పధకాలు రచిస్తున్నారు. సమయానుగుణంగా మాటలు చెప్పి బ్యాంకు ఖాతాలో నగదును మొత్తం కాజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్యాంకు అధికారులం అనే మాయమాటలు ప్రజలు నమ్మడం లేదని భావించిన సైబర్ దొంగలు రూటు మార్చారు. ప్రభుత్వ అధికారులమంటూ పేదవాడి వద్ద అందినంత దోచుకుంటున్నారు. కోవిద్ భీమా అంటూ కాల్ చేసారు... ఐసిడిఎస్ అధికారులమని కోవిడ్ లో మరణించిన వారి చిట్టా అడిగారు. చివరకు అంగన్వాడికే కుచ్చుటోపీ పెట్టి అకౌంట్లో ఉన్న నగదు మొత్తం కాజేశారు.

    వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా కదిరిలో అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తోంది అలివేలమ్మ. ఐసిడిఎస్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు కాల్ చేసారు. కొవిడ్తో మరణించిన వారి వివరాలు సేకరించేలా కలరింగ్ ఇచ్చారు. ఎగువపల్లికి చెందిన ఈశ్వరమ్మ ఇటీవల మృతిచెందింది. ఆమెకు ఇప్పటికే రూ.50 వేలు సాయం అందింది. ఈ సమాచారాన్ని తెలుకున్న మోసగాళ్లు డబ్బులు ఆమె కుటుంబ సభ్యులకు డబ్బులు అందాయి అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    ఇది చదవండి: పొట్టలో రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్.. వీడొక్కడే సినిమా చూపించిన స్మగ్లర్.. స్కాన్ చేసి షాకైన పోలీసులు


    కొవిడ్ వల్ల మరణించిన వారి వివరాలు చెప్పాలని అడిగారు. వారికి ప్రభుత్వం వల్ల అందిన సాయం చెప్పాలని సూచించారు. పేర్లు చెప్పేలోపే మృతిచెందిన ఈశ్వరమ్మ కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేలు అదిందని తెలిపారు. ఆమె పేరిట మరో 50 వేలు బీమా మంజూరైందని అంగన్వాడి కార్యకర్తకు చెప్పారు. గతంలో అందిన సాయాన్ని ఈశ్వరమ్మ కుమారుడు గరుడప్ప ద్వారా తెలుసుకుంది అలివేలమ్మ.

    ఇది చదవండి: ఈమె పేరు మృదుల.. పేరులో ఉన్నంత సాఫ్ట్ కాదు..! ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా..


    ఆ మాటతో మోసగాళ్లపై నమ్మకం వచ్చింది. మృతురాలి కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాకు బీమా సొమ్ము జమచేస్తామని అంగన్వాడి కార్యకర్తకు చెప్పారు. వారి ఫోన్ పే, గూగుల్ పే నంబర్లు చెప్పాలని కోరారు. వారెవరూ ఈ సదుపాయం వినియోగించడం లేదని అలివేలమ్మ చెప్పారు. మీ ఖాతాకు జమచేస్తామని బ్యాంక్, మొబైల్ వివరాలు చెప్పాలన్నారు. వారి మాటలను నమ్మిన అలివేలమ్మ వివరాలు చెప్పారు.

    ఇది చదవండి: ప్రియుడుతో కలిసి భర్త హత్య.., కొడుకుతో కలిసి స్కెచ్.. చివరికి అడ్డంగా దొరికిపోయింది..


    ఇదే అదనుగా ఓటీపీ నంబర్లు మహిళ ద్వారా కనుగొన్న మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.30 వేలు, రూ.24 వేలు చొప్పున రెండుసార్లు తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ను సరిచూసుకోగా అలివేలమ్మ ఖాతాలోని రూ.54,000 ఖాళీ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితురాలు కదిరి గ్రామీణ పోలీసుల సూచనమేరకు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఓటీపీలు అడిగితే అస్సలు చెప్పవద్దని హెచ్చరిస్తున్నారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Cyber crimes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు