శ్రీ సత్య సాయి జిల్లాలోని పలు మండలాల్లో వర్ష ప్రభావం వల్ల పంటలకుతీవ్రమైన నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట వర్షం కారణముల దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఒకసారిగా నేలమట్టమవ్వడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. రైతులకు జీవనాధారమైన పంట నష్టపోవడంతో వారు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి వ్యవసాయమే ముఖ్య ఆర్థిక వనరుగా వారు జీవనం సాగిస్తూ ఉన్నారు.
అలాంటి సమయంలో ఒక్కసారిగా పంట నష్టపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి రైతులు కూరుకుపోయారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో వడగళ్ల వర్షం కురవడంతో మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా పెనుగొండ మండలంలోని మోటివారి పల్లి వెంకటగిరి పాలెం, దుద్దేబండ, అమ్మవారి పల్లి గ్రామాలలో వర్షానికి మొక్కజొన్న పంట నేల కూలింది.
మండలంలో దాదాపుగా వంద ఎకరాల మేర మొక్కజొన్న పంట నష్టపోయింది. మోటు వారి పల్లి గ్రామానికి చెందిన మైలారప్ప మూడు ఎకరాలు, నరసింహప్ప 5 ఎకరాలు, మల్లికార్జున నాలుగు ఎకరాలు, బాలకృష్ణ రెండు ఎకరాలు దాసరి హరికృష్ణ 8 ఎకరాలు, దుబ్బ వెంకటరెడ్డి 4 ఎకరాలు మరియు తన్నీరు ఆదినారాయణ రెడ్డి రెండు ఎకరాలు, వడ్డీ సుబ్బరాయుడు మూడెకరాలు, కృష్ణారెడ్డి మూడు ఎకరాలు, గౌరీ శంకర్ రెండు ఎకరాలు మొత్తం నేలమట్టమయింది.
దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమనుఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దుద్దేబండ గ్రామంలోని రవీందర్ రెడ్డి కి చెందిన ఆరు ఎకరాలు, గొల్లపల్లి ప్రకాష్ రెడ్డి మూడెకరాలు, సుధాకర్ రెడ్డి నాలుగెకరాలు, చంద్రారెడ్డి మూడెకరాలు చొప్పున పంటను తీవ్రంగా నష్టపోయారు దీనిపై స్పందించిన ఏవో సురేందర్ నాయక్ ప్రభుత్వానికి నివేదిక పంపామని వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News