అనంతపురం జిల్లా గ్రామీణ నిరుద్యోగులు, శ్రీ సత్యసాయి జిల్లా గ్రామీణ నిరుద్యోగులకు మంచి సువర్ణ అవకాశం. ఆర్డిటి సంస్థ నిర్వహిస్తున్న అనంతపురం సెంటర్లో వివిధ రంగాలలో గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి వారికి రుణ సదుపాయం కూడా కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆర్డిటి (RDT)సంస్థవారు గ్రామీణ ప్రజల జీవన విధానాలలో ఎంతో మార్పును తీసుకువచ్చారు.
ఆర్ డి టి సంస్థ స్కూలును ఏర్పాటు చేసి గ్రామీణ పేదవారికి ఇల్లు కూడా నిర్మించి ఇస్తూ ఉంటుంది. ఇలా అనంతపురం అభివృద్ధిలో ఆర్డిటి సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ సంస్థఆధ్వర్యంలో నడిచే ఏపీ ఎకాలజీ సెంటర్లో గ్రామీణ యువతకు బైక్ రిపేరు మరియు ఆటో రిపేరీ లో నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు.
మరమ్మత్తులపై శిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఇంగ్లీష్, కస్టమర్లతో ఎలా మెలగాలి, వారిని ఎలా ఆకట్టుకోవాలి అనే అంశాలపై శిక్షణ ఉంటుందని ఈ శిక్షణ 45 రోజులపాటు టెక్నాలజీ సెంటర్లో ఇస్తామని తెలిపారు. వీటికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 8, 9, 10, ఇంటర్, ఐటిఐ చదివిన విద్యార్థులకు అర్హత అని తెలిపారు.
ఆసక్తి కలిగిన గ్రామీణ నిరుద్యోగ యువత ఆధార్ కార్డు, వారి రేషన్ కార్డు మరియు సంబంధిత క్వాలిఫికేషన్ కలిగిన సర్టిఫికెట్ ఫోటోలు తీసుకుని ఎకాలజీ సెంటర్ ను సంప్రదించాలని తెలిపారు. వారికి ఇక్కడ ఉచిత భోజన సదుపాయంతో పాటు ఉచిత వసతి కూడా కల్పిస్తామని తెలిపారు ఏమైనా సందేహాలు ఉంటే వివరాలు కోసం 9390505952 మరియు 7780752418 కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Job, Local News