హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapur: ఈ థియటర్ లోకి వెళ్తే... థ్రిల్ మాములుగా ఉండదు..!

Anantapur: ఈ థియటర్ లోకి వెళ్తే... థ్రిల్ మాములుగా ఉండదు..!

X
ప్రత్యేకమైన

ప్రత్యేకమైన సినిమా హల్

Andhra Pradesh: అనంతపురం పట్టణంలోని బెంగళూరు హైదరాబాద్ హైవేలో రాంనగర్ బ్రిడ్జి వద్ద గల చోట మహల్ సినీప్రియులనుఎంతో ఆకర్షిస్తుంది.కారణం దీని నిర్మాణమే ప్రత్యేకంగా ఉండటం. ఇది ఒక గ్లోబ్ఆకారంలో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(G.Venkatesh, News 18, Ananthapur)

అనంతపురం పట్టణంలోని బెంగళూరు హైదరాబాద్ హైవేలో రాంనగర్ బ్రిడ్జి వద్ద గల చోట మహల్ సినీప్రియులనుఎంతో ఆకర్షిస్తుంది. ఇది ప్రత్యేకమై నిర్మాణం కల్గి ఉంటుంది.   ఇది ఒక గ్లోబ్ఆకారంలో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.హైవేకి పక్కనే ఉంటుంది. ప్రేక్షకులకు వాహనాల పార్కింగ్ చేయడానికి పార్కింగ్ ప్లేస్ కూడా అందుబాటులో ఉంది.చోటా మహల్ లోకి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ ప్లేస్ కూడా ఎంతో సుందరంగా నిర్మించారు.

చూడడానికి కూడా బయట నుంచి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ సినిమా హాల్ కి వెళ్లాలనుకున్న వాళ్లు టికెట్ ను ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్దనే తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా పేటీఎం మరియు బుక్ మై షో యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్తే ఎంతో సుందరంగా సీట్లు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాక స్క్రీన్ కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఆ స్క్రీన్ ఏర్పాటు కూడా భిన్నంగా ఉంటుంది.

ఈ చోట మహల్ 100 సీట్ల కెపాసిటీతో నిర్మించడం జరిగింది. లోపల ఆకారంలో వివిధ లైట్ల మరియు డిజైన్లతో అందంగా నిర్మించారు. ఇది చిన్న పిల్లలకు కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. వయసు అయిన వారు, కుటుంబ సమేతంగా కూడా వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి కొత్త సినిమా కూడా ప్రదర్శన చేస్తూ ఉంటారు. ప్రేక్షకులకు ఇక్కడ క్యాంటీన్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

పిల్లలకు మరియు పెద్దవారికి కూడా ఇక్కడ అన్ని రకాల జంక్ ఫుడ్స్ మరియు బిస్కెట్స్ అందుబాటులో ఉంటాయి. టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇది కచ్చితంగా కుటుంబం సమేతంతో వెళ్లవలసిన చక్కటి సినీ మహల్.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు