హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. కారణం ఏంటో తెలుసా..?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. కారణం ఏంటో తెలుసా..?

 Balakrishna Photo : Twitter

Balakrishna Photo : Twitter

Nandamuri Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణపై కేసులు నమోదు కావడం కొత్త కాదు.. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఆయనపై వ్యతిరేకత ఉండడం కాయ.. ఇందులో భాగంగా సాధారణంగానే కేసులు నమోదు అవుతాయి. అయితే తొలిసారి హిజ్రాలు కేసు చేయడం సంచలనంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  Nandamuri Balakrishna: హీరో.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటు సినిమాల్లో దూకుడు చూపిస్తూనే.. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) కి వైఎసఆర్ పేరు పెట్టడంపై ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచారు.. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.. దీంతో బాలయ్య రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. ఆ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలయ్యపై వైసీపీ నేతలు ఆపకుండా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజా ఆయకు సంబంధించి మరో అంశం సంచలనంగా మారింది.

  తాజాగా బాలకృష్ణ పై హిందూపురం (Hindupuram) పోలీస్ స్టేషన్ లో కొందరు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అది కూడా హిజ్రాలు ఆయనపై కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే బాలయ్యపై ఇలాంటి కేసులు చాలా నమోదు అయ్యాయి. కానీ అందులో హిజ్రాలు కేసు పెట్టడం ఇదే తొలిసారి.. అయితే వారు కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే..?

  హిందూపురంలో బాలయ్య ఉండడంలేదని కొంతమంది హిజ్రాలు బాలయ్యపై ఫిర్యాదు చేశారు. గతంలో బాలయ్య పై ఇదే తరహా కేసులు చాలా నమోదయ్యాయి.. అయితే అందులో ఎక్కువ ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తలే ఇలాంటి కేసులు పెట్టారని.. స్థానిక నేతలు దగ్గరుండి ఇలాంటి కేసులు పెట్టించారన్నది టీడీపీ నేతల వాదన.. మరి ఈ హిజ్రాలు స్వతహాగా బాలయ్యపై కేసు చేశారు. వెనుక ఎవరైనా ఉన్నారా అన్నది చూడాలి.

  ఇదీ చదవండి : మీ రేషన్ కార్డు తీసేశారా? ఇలా చేస్తే మళ్లీ కొత్తది వస్తుంది.. ఎలా అప్లై చేయాలి?

  హిందూపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వహించాల్సిన బాలకృష్ణ ఇక్కడ ఉండడం లేదని, వెంటనే హిందూపురంలోని సమస్యలను పట్టించుకోని వాటికి పరిష్కారాలు వెతకాల్సిందిగా కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా కావాలనే కొంతమంది ప్లాన్ చేసి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

  ఇదీ చదవండి : అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం.. ఈ రోజు దర్శించుకుంటే ఫలితం ఏంటో తెలుసా?

  చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో లేరు.. హిందూపురంలోనే బాలయ్య తో పాటు మరికొంతమంది కూడా లేరు.. కానీ ఫిర్యాదు మాత్రం బాలయ్య మీదనే ఎలా ఇస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయనకు సమయం దొరికినప్పుడు నియోజకవర్గానికి వస్తున్నారని.. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Jai Balayya