హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జ్వరమొచ్చిందని ఆర్ఎంపీ దగ్గరకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!

జ్వరమొచ్చిందని ఆర్ఎంపీ దగ్గరకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!

ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో బాలుడు మృతి

ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో బాలుడు మృతి

జ్వరం వస్తుందని, జలుబు చేసిందని ఖర్చు తక్కువని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుల దగ్గరకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఆ మందులు తాత్కాలిక ఉపశమనం కల్గించినా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందంట..!

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

G Venkatesh, News18, Anantapuram

జ్వరం వస్తుందని, జలుబు చేసిందని ఖర్చు తక్కువని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుల దగ్గరకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఆ మందులు తాత్కాలిక ఉపశమనం కల్గించినా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందంట..! అలాంటి ఘటనే అనంతపురంలో కలకలం రేపింది. చూడండి ఆ వివరాలు..! ఈ మధ్యకాలంలో ప్రతి ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కువగా వైద్య సేవలు మొదలుపెట్టేస్తున్నారు. వారిలో చాలా మందికి సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో తెలియదు. ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో తెలియదు. ఇలాంటి వారి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దికాలం శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathyasai District) లోని కొత్తచెరువు మండలంలో ఎటువంటి సర్టిఫికెట్లు లేకపోయినా చిన్న పిల్లల డాక్టర్ గా చలామణి అవుతూ వస్తున్న ఒక ఆర్ఎంపీని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

తాజాగా అనంతపురం జిల్లా (Anantapuram District) లోని పెద్దపప్పూరు మండలంలో అమ్మలదిన్నె గ్రామంలో జలుబు దగ్గు జ్వరం ఉందని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పిల్లవాడిని తీసుకెళితే అక్కడ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే పిల్లవాడు స్పృహ కోల్పోయి కొద్దిసేపటికి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నరేంద్రబాబు కుమారుడు నిశాంత్‌ (4) అనే బాలుడికి జలుబు, దగ్గు ఉండడంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు శేషాచారి వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లారు.

ఆర్‌ఎంపీ వైద్యుడు బాలుడుని పరిశీలించి జ్వరం కూడా ఉందని ఇంజెక్షన్‌ ఇచ్చారు. కొద్ది సేపటికే బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అయితే తక్షణం ఇంకో సూదిని కూడా ఆర్ఎంపీ డాక్టర్ పిల్లవాడికి చేశాడు. కానీ స్పృహ రాకపోవడంతో వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేటప్పుడు మార్గమధ్యంలో బాలుడుమృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఇది చదవండి: ఎంతిచ్చినా సరిపోలేదంట.. పెళ్లైన పదేళ్ల తర్వాత కూడా..!

ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారున్ని కోల్పోయామని తండ్రి నరేంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంపై ఎస్‌ఐ ఖాజాహుసేన్ ను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మండల వైద్యాధికారి కల్యాణ్ ‌కుమార్ ‌తో ప్రస్తావించగా అమ్మలదిన్నె ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు వైద్య సిబ్బందిని పంపినట్లు తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు