హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapuram: కిక్కు కావాలి అనుకునే వారు తప్పక చూడాల్సిన ప్లేస్.. థ్రిల్ మామూలుగా ఉండదు..

Anantapuram: కిక్కు కావాలి అనుకునే వారు తప్పక చూడాల్సిన ప్లేస్.. థ్రిల్ మామూలుగా ఉండదు..

అక్కడకు

అక్కడకు వెళ్తే థ్రిల్ మామూలుగా ఉండదు.

Anantapur: వింటర్ లో సాధారణంగా చాలామంది టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్లాలని ఆరాటపడతారు..? అందులోనూ కిక్కు ఇచ్చే ప్లేస్ అంటే మరింత సరదా పడతారు.. అలా అడ్వంచర్ ఫీల్ కావాలి అనుకున్నవారికి పూర్తి థ్రిల్ ఇచ్చే ప్లేస్ ఇది.. ఏంటి స్పెషల్ ఏంటి తెలుసా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  G.Venkatesh, News 18, Ananthapur

  Best Tourist Spot:  వింటర్ సీజన్ ఎంటర్ అయ్యింది అంటే చాలాు పికినిక్ స్పాట్ లు.. పర్యాటక ప్రాంతాల్లో సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా నవరంబర్, డిసెంబర్ నెలల్లో పర్యాటక ప్రాంతాలకు (Tourist Spots) వెళ్లాలని చాలామంది  కోరుకుంటారు. అందులోనూ కాస్త అడ్వంచర్ ఫీల్ (Adventure Feel) కలిగేవి అంటే.. మరింత ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి ఇది సరైన స్పాట్.. ఇక్కడ థ్రిల్లింగ్ మామూలుగా ఉండదు.. ఎక్కడ అంటే..? అనంతపురం (Anantapuram) నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో గల హంపపురం గ్రామంలో NH44 హైవే పక్కన ఆక్వా థ్రిల్ వాటర్ పార్క్ (Aqua Thril Water Park) ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటారు. దీనిలో చిన్న పిల్లలకు మంచి అనుభూతి కలిగిస్తుంది పెద్దలు కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంతకు ముందు అనంతపురం నగర వాసులు స్విమ్మింగ్ పూల్ వెళ్లాల్సి వచ్చిన.. చిన్న పిల్లలతో సరదాగా వాటర్ ఫాల్స్ వెళ్లాల్సి వచ్చినా.. చాలా ఇబ్బందిగా ఉండేది.

  ఇప్పుడు అనంతపూర్ దగ్గరలోనే అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు స్విమ్మింగ్ చేయడానికి తక్కువ ఎత్తులోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్లో పైనుంచి జారుతూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. దాదాపుగా పదిహేను అడుగుల నుంచి వాటర్లోకి జార వచ్చు. చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది.రింగ్ లాగావాటర్ తిరుగుతూ పైపు ద్వారా కిందికి జారుతూ వాటర్ కూడా కనిపిస్తూ ఉంటుంది.

  పెద్దలకు కూడా చాలా బాగుంటుంది వారు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఖచ్చితంగా చిన్న పిల్లలకు బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి కనీస ధర చెల్లించాల్సి ఉంటుంది. లోపల వాటర్ గేమ్స్ ఉన్నాయి.  వీటిలో పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్  ఉంది. tots kids నుంచి నీరు కిందికి పడుతు ఉంటుంది. రింగుల నుంచి బకెట్ లాంటి వాటి నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. వీటి కింద పిల్లలుఎంజాయ్ చేస్తూ ఉంటారు. rain dance కూడా ఎంజాయ్ చేయొచ్చు.

  ఇదీ చదవండి : సైలెంట్ గా పని కానిచ్చేస్తారు.. కేసులు లేకుండా కిరికిరి చేస్తారు.. కానీ ఏమైందంటే..?

  ముఖ్యంగా చిన్నపిల్లలు రెయిన్ డాన్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేస్తారు. వీటిలో రైడ్ పూలు కూడా థ్రిల్లింగ్ కలిగిస్తుంది. దీనిలో పిల్లలు రైడ్ చేయొచ్చు. ఇక్కడ మనకు నిర్వాహకులు స్విమ్మింగ్ డ్రస్ కూడా అందిస్తారు. వాటిని ధరించి స్విమ్మింగ్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కోర్ట్​ లోఅన్ని రకాలైన వంటకాలు లభిస్తాయి. నాన్వెజ్, వెజ్, ఐస్ క్రీమ్, చాక్లెట్ కూల్ డ్రింక్ లభిస్తాయి. వీకెండ్లో ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్రదేశం. ముఖ్యంగా సమ్మర్లో ఇంకా చాలా బాగుంటుంది. ఆహ్లాదంగా ఉంటుందని చెబుతున్నారు పర్యాటకులు.ఇంకెందుకు ఆలస్యం అందరూ తప్పకుండా వెళ్లి ఎంజాయ్ చేయండి. వింటర్ లోనూ అదే క్రేజ్ ఉంటోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Best tourist places, Local News

  ఉత్తమ కథలు