G Venkatesh, News18, Anantapuram
అనంతపురం (Anantapuram) నగరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో బాలోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు సందడిగా జరిగిన బాలోత్సవ్ వేడుకల్లో ప్రదర్శనలు ఆఖట్టుకుున్నాయి. పదవ తరగతిలోపు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల నుంచి వందల సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు ఎప్పుడూ పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పడుతూ, ఒత్తిడికి గురవుతూ ఉంటారని, వారిలోనే సృజనాత్మకతను ప్రతిభను వెలికి తీయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలల నుంచి బాల బాలికలు పాల్గొని డాన్సులు, పాటలు, మరియు నాటకాలు ఇతర అనేక కార్యక్రమాలు చేశారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఉత్సాహం పెరిగి వారిలో ఒత్తిడి తగ్గుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థులను చదవడానికి పరిమితం చేసి, ఒత్తిడికి గురి చేస్తున్నారని పిల్లలు కూడా అలాగే పెరుగుతున్నారని, వారిని ఇలాంటి కార్యక్రమాల వల్ల వారిలోనే ప్రతిభను గుర్తించవచ్చని, ఒత్తిడిని తగ్గించవచ్చని ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రోజుకు వందల సంఖ్యలో పిల్లలు మరియు వేల సంఖ్యలో వీక్షకులు హాజరయ్యారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా బాలోత్సవాలు జరిగాయి. బాలికలు చూడముచ్చటైన డ్యాన్సులతో అలరించారు మరియు బాల,బాలికలు కలిసి నాటకాలు ప్రదర్శించి, వారిలోని కళలుకూడా కనబరిచారు. అయితే కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రదేశంలో కొంతమంది ప్రోత్సహించేవారు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. నిజంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల బాల బాలికల ప్రతిభను గుర్తించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News