హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Baahubali thali: ఈ బాహుబలి తాలీ 30 వంటకాలు.. 30 నిమిషాల్లో తింటే రూ.లక్ష ప్రైజ్!

Baahubali thali: ఈ బాహుబలి తాలీ 30 వంటకాలు.. 30 నిమిషాల్లో తింటే రూ.లక్ష ప్రైజ్!

X
బాహుబలి

బాహుబలి తాలీ

బాహుబలి తాలీలో ఒక కుండ బిర్యాని, ఫిష్, నాటుకోడి, ఆమ్లెట్, గుడ్డు, చికెన్ అంతేకాక చికెన్ తో చేసిన వివిధ రకాల వంటకాలు, రెండు గ్లాసుల లస్సి, రెండు కూల్ డ్రింక్స్ మొత్తం 30 రకాల వంటకాలు అందిస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

రిపోర్టర్ : వెంకటేష్

లొకేషన్ : అనంతపురం

అనంతపురం (Anantapur) నగరంలో బాహుబలి తాలీ  (Baahubali Thali) చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాక అందులో వచ్చే వెరైటీలు చాలా రకాలుగా ఉంటాయి. అనంతపురం నగరంలోని తపోవనంలో గల హైవే పక్కన నాయుడు గారి కుండా బిర్యాని సెంటర్లో బాహుబలి తాలీ చాలా ఫేమస్. ఈ బాహుబలి తాలీలో 30 రకాల రుచికరమైన వంటకాలను అందిస్తారు. ధర రూ.2000 రూపాయలు. ఈ నాయుడు గారి కుండ బిర్యాని సెంటర్లో ఇతర రకాలైన వంటకాలు కూడా లభిస్తాయి. అయితే ఈ బాహుబలి తాలీకి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ బాహుబలి తాలీ ఎవరైనా తింటే వారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటించారు.

Tirumala; ఏప్రిల్‌లో తిరుమలకు వెళ్లానుకుంటున్నారా? మీ కోసమే ఈ కీలక అప్‌డేట్

అయితే ఇందులో కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ బాహుబలి తాలీలో 30 రుచికరమైన వంటకాలు కప్పులో అందిస్తారు. అయితే ఈ 30 రుచికరమైన వంటకాలను 30 నిమిషాలలో తినాల్సి ఉంటుంది. ఎవరైతే 30 నిమిషాలలో పూర్తిగా తింటారో వారికి లక్ష రూపాయలు బహుమతి హోటల్ యాజమాన్యం అందిస్తుంది. ఈ ఛాలెంజ్ ను అనంతపురం నగరంలోని యూత్ స్వీకరిస్తున్నారు. ఒక్కొక్కరుగా పోటీపడి మరీ ఛాలెంజ్ స్వీకరించి గెలవాలని ముందుకు వస్తున్నారు.

ఈ బాహుబలి తాలీలో ఒక కుండ బిర్యాని, ఫిష్, నాటుకోడి, ఆమ్లెట్, గుడ్డు, చికెన్ అంతేకాక చికెన్ తో చేసిన వివిధ రకాల వంటకాలు, రెండు గ్లాసుల లస్సి, రెండు కూల్ డ్రింక్స్ మొత్తం 30 రకాల వంటకాలు అందిస్తారు. ఈ ఛాలెంజ్ ను ఎవరైనా స్వీకరించవచ్చు. అంతేకాక ఈ నాయుడు గారి కుండ బిర్యాని సెంటర్లో వివిధ రకాల రుచికరమైన నాన్ వెజ్ కూడా లభిస్తుంది. ఇక్కడ మంచి నాణ్యమైన రుచికరమైన నాన్ వెజ్ రకాలను కూడా అందిస్తామని చెప్తున్నారు ఈ నాయుడు గారి కుండ బిర్యాని సెంటర్ నిర్వాహకులు.

First published:

Tags: Anantapuram, Local News

ఉత్తమ కథలు