G Venkatesh, News18, Anantapuram
కేరళ (Kerala) లోని ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం (Shebarimala Ayyappa Temple). ఈ దేవాలయంకి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు. అయ్యప్ప స్వామిని ఎంతో నిష్టతో భక్తితో పూజిస్తారు. అయ్యప్ప స్వామిని పూజించేటప్పుడు ఎలాంటి విధమైన చెడు అలవాట్లు పనులు చేయరు మరియు చాలా పవిత్రంగా పూజిస్తారు. స్వామిని పూజించేటప్పుడు ఇంట్లో ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసి ఉపవాసంతో పూజిస్తారు. అలాగే మొదటిసారిగా మాలవేసిన వారిని కన్నస్వాములని పిలుస్తారు. మరియు ఎక్కువ సంవత్సరాలు అయ్యప్ప మాల వేసిన వారిని గురు స్వాములని పిలుస్తారు. ఇలాగా గురు స్వాములు కొన్ని సంవత్సరాలు అయ్యప్ప మాల వేసి పూజలు చేసి శబరిమల అయ్యప్పను దర్శిస్తారు.
చాలామంది గురు స్వాములు దాదాపుగా అంటే 30 నుంచి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయ్యప్పమాలను ధరించిన స్వాములు కూడా ఉంటారు. స్వాములు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఒక రోజు గానీ, మూడు రోజులుగాని, తొమ్మిది రోజులు గాని ,43 రోజులు,గాని వారు నిష్టగా పూజలు చేసి అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళలోని శబరిమలకు వెళ్తూ ఉంటారు.
అలాంటి వారు ట్రైన్స్ గాని బస్సులు గాని మరియు ఇతర ట్రావెల్స్ ద్వారా శబరిమలకు వెళ్తుఉంటారు. మరియు అంతేకాక వారి ప్రాంతాల నుంచి ఇరుముడిని తలపై పెట్టుకుని కాలినడకన కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అలా కాలినడకన వెళ్తున్న భక్తులను న్యూస్ 18 పలకరించింది.
ఇది చదవండి: రైలు పట్టాలపై సినిమాటిక్ సీన్.. నిజంగా నువ్వు దేవుడు సామీ
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నుంచి కాలినడకన బయలుదేరిన భక్తుల పాదయాత్ర అనంతపురం జిల్లాకు చేరుకుంది. తమ పాదయాత్ర ప్రారంభంలో కాస్త కష్టమనిపించినా క్రమంగా అలవాటు పడ్డామని.. అయ్యప్ప దయతో సవ్యంగా సాగుతోందని భక్తులు చెప్పారు. మొదటి రోజు తక్కువ ప్రయాణించామని కానీ వెళ్తూ వెళ్తూ మాకు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మొదటి రోజు కంటే ఇప్పుడు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు రోజుకి కాలినడకన నడుచుకుంటూ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నామని చెప్పారు. తమను అయ్యప్ప స్వామే కాపాడుతారని తెలిపారు. వారికి కావాల్సిన సామాగ్రి కారులో ఉంచి, కారు ముందు 15 కిలోమీటర్లు ఆపిన తర్వాత స్వాములు 15 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి అక్కడ వారి ఆహారం చేసుకొని భోజనం చేసిన తర్వాత బయలుదేరి శబరిమలకి వెళ్తూ ఉంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Ayyappa devotees, Local News