G Venkatesh, News18, Anantapuram
ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District).. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా (Satyasai District) లోని పెనుగొండ మండలం వెంకటగిరి పాలెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ (ZPHS High School) కూరగాయలు (Vegetibles) పండిస్తారు. ఆ కురగాయల తోనే మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగావంట చేస్తూ విద్యార్థులకు అందిస్తున్నారు. హైస్కూల్లో దాదాపుగా మూడు ఎకరాల భూమి ఉంది. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలు, ఇతర చెట్లు ఎక్కువగా ఉండేవని.. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఆలోచనలతో ఆ పిచ్చి మొక్కలు, ముళ్ళ చెట్లను తొలగించారు. అంతేకాదు విద్యార్థులకు ఉపయోగపడే పని చేశారు.
పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్న సమయంలో పాములు విపరీతంగా ఉండేవని, వాటి కారణంగా విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉండేదని.. వాటిని తొలగించడంతో ఇప్పుడు పాముల బెడద లేకుండా పోయిందని, ప్రధానోపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర మొక్కలను తొలగించి వాటి స్థానంలో బెంచ్ లను ఏర్పాటు చేశారు, అలాగే పిల్లలకు ఆడుకునేకి ఆట స్థలంగా.. అలాగే లాంగ్ జంప్ కావలసిన ఏర్పాట్లు చేశారు.
పాఠశాల ఆవరణలో ఉన్న కొంత స్థలంలో మిరప, వంకాయ, టమోటా ఇతర ఆకుకూరలు పండించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వాటితోనే వంట చేయడం ప్రారంభించారు. అంతేకాదు కూరగాయల్లో ధరలు హెచ్చుతగ్గులు ఉండటంతో ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదని విద్యార్థులకు తాజా కూరగాయలతో వంట వండడంతో ఆరోగ్యంగా కూడా ఉంటారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
ఇదీ చదవండి : పేదలకు ఆపన్నహస్తం.. అనాథలకు ఆపద్భాందవురాలు ఆమె.. ఏం చేస్తున్నారో చూడండి
అలాగే వీటికి నీటి సదుపాయం కల్పించామని, అంతేకాక విద్యార్థులు చేతులు కడుక్కున్న తర్వాత వేస్టేజ్ వాటర్ వృథా కాకుండా చెట్లకి ఉపపయోగిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దీనికి పాఠశాల చైర్మన్.. గ్రామస్తుల సహకారాలు అందిస్తున్నారన్నారు. ఈ కూరగాయలు పండించేటప్పుడు ఎక్కడైనా చీడపురుగులు కనిపిస్తే వాటికి ఎలాంటి పిచికారి చేయాలని చైర్మన్ సలహాలు ఇస్తారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
ఇదీ చదవండి : ప్రభుత్వం తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
పాఠశాలలోనే ఇతర ఉపాధ్యాయులతో కలిసి చర్చించి విన్నూత్నంగా ఆలోచించి విద్యార్థులకు ఉపయోగపడే వాటిపై దృష్టి పెట్టామని, పాఠశాలలో నాడు నేడు పథకంలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించి, వాటి స్థానంలో బెంచ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా పాఠశాల గేటు వద్ద నుంచి స్కూల్ భవనం వరకు రోడ్డు ఇరువైపులా ట్రాఫిక్ సైన్స్ బోర్డ్స్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ రూల్స్ పైన మరియు వాటిపై విద్యార్థులకు ఇప్పటి నుండే అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Ap government, AP News, AP Schools