G Venkatesh, News18, Anantapuram
సమ్మర్ సీజన్ (Summer Season) మొదలైంది. ఉక్కపోత వాతావరణంతో జనం హడలిపోతున్నారు. హాట్ సమ్మర్ లో కాస్త చిల్ అయ్యేందుకు వాటర్ పార్క్స్ వంటి వాటివైపు జనం క్యూ కడుతున్నారు. ఈ వేసవిలో మనసుకు, శరీరానికి కాస్త చల్లదనం ఇచ్చేందుకు అనంతపురంలో వాటర్ పార్క్ సిద్ధమైంది. అనంత వాసులకు ఆక్వాథ్రిల్ వాటర్ పార్క్ ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. ఇక్కడ వివిధ రకాల స్విమ్మింగ్ పూల్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్, వాటర్ గేమ్స్, జంగిల్ వాటర్, పిల్లల కోసం స్పెషల్ వాటర్ గేమ్స్ ను ఇక్కడ అందుబాటులో ఉంచారు. వేసవిలో కుటుంబంతో సహా ఆహ్లాదంగా గడపడానికి నిర్వాహకులు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
మూడేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ రూ.400 చొప్పున టికెట్ ఉంటుంది. దీని ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సరదాగా గడపొచ్చు. ఇక్కడ కిడ్స్ కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. కేవలం రెండు మూడు అడుగుల లోతుతో పూల్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వందలకొద్దీ చిన్న పిల్లలు ఇక్కడ సేద తీరుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. మధ్యాహ్నం భోజనం సదుపాయం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడున్న రెస్టారెంట్లో మరియు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. పిల్లలకు ఐస్ క్రీములు కూడా లభిస్తాయి.
అంతేకాక స్విమ్మింగ్ చేయడానికి ప్రత్యేకమైన సూట్లు కూడా ఇక్కడ అందిస్తారు. మహిళలకు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైన గదులను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు నిత్యం చిన్న పిల్లలు కుటుంబ సమేతంగా పెద్దవారు వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. మీరు కూడా వేసవిలో సేద తీరాలంటే కచ్చితంగా వెళ్లాల్సిన ప్రదేశం వాటర్ పార్క్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News