ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కి చెందిన ఓ మహిళా మంత్రి టీచర్‌గా మారిపోయారు. తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో మేడమ్‌కి షడన్‌గా పిల్లలు పాఠాలు చెప్పాలని పించింది. అంతే చాక్‌పీస్‌తో బ్లాక్ బోర్డుపై పాఠాలు చెబుతూ స్టూడెంట్స్‌తో పాటు స్కూల్ స్టాఫ్‌ని ఆశ్చర్యపరిచారు. పంతులమ్మగా మారిన ఆ మంత్రి ఎవరో కాదు అనంతపురం(Anantapur)జిల్లా కల్యాణదుర్గం(Kalyanadurgam) ఎమ్మెల్యే, ఏపీ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్(Ushasree Charan). అంతకు ముందు హైస్కూల్(High school)లోని రికార్డులను పరిశీలించారు.
పంతులమ్మగా మారిన మంత్రి..
ఎక్కడైనా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆటలు, ఆడటం, పని చేయడం, లేదంటే మొక్కలు నాటడం చూశాం. కాని ఏపీకి చెందిన మంత్రి ఉషశ్రీచరణ్ మాత్రం ఏకంగా హైస్కూల్‌కి వెళ్లి విద్యార్ధులకు పాఠాలు బోధించారు. అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గం కల్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ హైస్కూల్‌కి ఆకస్మిక తనిఖీ చేయడానికి వెళ్లారు మంత్రి ఉషశ్రీ. మంత్రి స్కూల్‌కి రావడంతో స్టాఫ్ అంతా అలర్ట్ అయ్యారు. ముందుగా స్కూల్ రికార్డులను పరిశీలించిన మంత్రి అటుపై స్కూల్లో సౌకర్యాలను పరిశీలించారు.
నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు. pic.twitter.com/N9ikTr7U3v
— K.V.Ushashricharan (@ushashricharan) November 5, 2022
స్కూల్లో పాఠాలు..
అక్కడి నుంచి తరగతి గదుల్ని, విద్యార్ధులకు ఉపాధ్యాయులు ఎలాంటి పాఠ్యాంశాలు చెబుతున్నారో అబ్జర్వ్ చేసేందుకు ఆరవ తరగతి గదికి వెళ్లారు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి. క్లాస్‌లో ఉన్న విద్యార్ధులకు ఆరవ తరగతిలోని సిలబస్‌కి చెందిన పాఠాలు చెప్పారు. అయితే 6వ తరగతి స్టూడెంట్స్ కావడంతో మంత్రి క్లాస్ ఇంగ్లీష్‌లో బోధించారు. బోర్డుపై కొన్నింటిని రాసి వాటిపై విద్యార్థులను పలు ప్రశ్నలు వేశారు మంత్రి. వాళ్లనుంచి సమాధానాలు రాబట్టారు.
అనుభూతిని షేర్ చేసుకున్న మంత్రి..
రాష్ట్ర మంత్రి హైస్కూల్‌కి రావడం, పాఠాలు చెప్పడంతో విద్యార్ధులు శ్రద్ధగా ఆలకించారు. కొద్దిసేపటికి మంత్రి స్టూడెంట్స్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్లిపోయారు. మంత్రి ఉషశ్రీచరణ్ స్కూల్లో పాఠాలు చెప్పిన వీడియోను సోషల్ మీడియా ద్వారా మంత్రి అందరితో షేర్ చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Minister