హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

janasena: పొత్తులపై క్లారిటీ అప్పుడే.. పవన్ వారాహి యాత్రపై నాగబాబు క్లారిటీ..

janasena: పొత్తులపై క్లారిటీ అప్పుడే.. పవన్ వారాహి యాత్రపై నాగబాబు క్లారిటీ..

వైసీపీపై నాగబాబు ఫైర్

వైసీపీపై నాగబాబు ఫైర్

janasena: జనసేన - తెలుగు దేశం పొత్తు ఫిక్స్ అయినట్టేనా..? అధికారికంగా ప్రకటించేది ఎప్పుడు..? ఎవరికి ఎన్ని సీట్లు.. ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలాయి.. ఇప్పటి వరకు రెండు పార్టీలు అధికారికంగా అయితే ప్రకటించలేదు.. తాజాగా ఈ పొత్తులపై జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పొత్తులపై తీవ్ర చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desa Party), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయని దాదాపు అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రెండు పార్టీలు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేపట్టబోయే వారాహి (Varahi) యాత్ర ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతుంది..?  ఆ సమయంలో పొత్తులపై ప్రకటన చేస్తారా..? పొత్తులపై ప్రకటన చేయకుండా యాత్ర ఎలా చేస్తారు..? తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ జసేన నేత, పీఏసీ సభ్యుడు నగబాబు (Nagababu) క్లారిటీ ఇచ్చారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) త్వరలోనే ఏపీలో వారాహి యాత్ర మొదలుపెడతారని వెల్లడించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు నాగబాబు ఆదివారం అనంతపురం పట్టణంలో పర్యటించారు. అక్కడి కలెక్టరేట్ నుంచి చెరువుకుట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్లే దారి అధ్వానంగా ఉండటంతో ఆ రోడ్డును పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో నాగబాబు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే, జనసేన రోడ్లు బాగు చేయాలనుకున్న నేపథ్యంలో రాత్రికిరాత్రే అధికారులు నిధులు మంజూరు చేసి, ఈ రోడ్లను ప్రభుత్వం బాగు చేస్తోందని నాగబాబు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉందని ఆరోపించారు.

ఇదీ చదవండి : బ్యాంకులు.. ఏటీఎంల దగ్గర ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే అంతే..?

వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహకారంతో జనసేనను ఇబ్బంది పెట్టినంత మాత్రాన కార్యక్రమాలు ఆపే ప్రసక్తి లదన్నారు. సీఎం జగన్ ఎలాగూ రోడ్లు వేయరు. అందుకే జన సైనికులు రోడ్లు వేయాలని భావించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రభుత్వం.. చేయదు.. చేద్దాం అనుకునే వారిని కూడా చేయనివ్వదు అన్నారు. అందుకే ఏదో ఒక కారణం చెప్పి ఇలాంటి మంచి పనిని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : విశాఖలో జీ-20 సదస్సుకి సర్వం సిద్ధం.. ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే..

అలాగే వారాహి యాత్ర.. పొత్తులపైనా ఆయన స్పందించారు. ఈ యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారు. ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు అన్నారు. మరోవైపు నాగబాబు పర్యటనపై స్థానిక పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్ల మరమ్మతుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలపై నాగబాబు, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రథమైన వారాహికి ఈ నెల 24న కొండగట్టులో వాహన పూజ చేయించనున్నారు. తెలంగాణ లోని కొండగట్టులో ఈ మంగళవారం ఆయన పూజ నిర్వహిస్తారు. తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. తర్వాత ఆయన ప్రచార యాత్ర మొదలయ్యే అవకాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Janasena, Naga Babu Konidela

ఉత్తమ కథలు